ఆసీస్ ప్రధానిపై గుడ్డుతో దాడి!(వీడియో)

మెల్‌బోర్న్: న్యూసౌత్‌వేల్స్‌లోని అల్బరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానిపై ఓ మహిళ గుడ్డుతో దాడి చేసింది. ఈ నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ సంఘటనే నిదర్శనమని స్థానికులు తెలిపారు. పపువా న్యూగినియాలోని మానస్ దీవిలో ఎంతోమంది శరణార్థులను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్బంధించడాన్ని నిరసిస్తూ తాను గుడ్డుతో దాడి చేసినట్లు మహిళ పేర్కొంది. ఈ దాడి తర్వాత ప్రధాని తనపై గుడ్డు పగిలిన చోట […] The post ఆసీస్ ప్రధానిపై గుడ్డుతో దాడి!(వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెల్‌బోర్న్: న్యూసౌత్‌వేల్స్‌లోని అల్బరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానిపై ఓ మహిళ గుడ్డుతో దాడి చేసింది. ఈ నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ సంఘటనే నిదర్శనమని స్థానికులు తెలిపారు. పపువా న్యూగినియాలోని మానస్ దీవిలో ఎంతోమంది శరణార్థులను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్బంధించడాన్ని నిరసిస్తూ తాను గుడ్డుతో దాడి చేసినట్లు మహిళ పేర్కొంది. ఈ దాడి తర్వాత ప్రధాని తనపై గుడ్డు పగిలిన చోట శుభ్రం చేసుకున్నారు. అనంతరం అధికారులు నేలపై పడేసిన నిరసన తెలిసిన సదరు మహిళను స్వయంగా పైకి లేపారు. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని, ఎలాంటి ఆందోళనలనైనా ఎదుర్కొని నిలబడుతామని ప్రధాని స్కాట్ మోరిసన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ప్రధానిపై గుడ్డుతో దాడి జరిగిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Australia PM Scott Morrison egged on Campaign Trail

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆసీస్ ప్రధానిపై గుడ్డుతో దాడి!(వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: