ప్రధాని బహుమతుల వేలానికి వేళాయే..

  ఈ నెల14 నుంచి 2772 బహుమతుల వేలం న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి గత ఆరు నెలల్లో వచ్చిన దాదాపు 2772 బహుమతులను ఈనెల 14 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్‌లైన్ ద్వారా వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ బుధవారం వెల్లడించారు. ఈ మెమెంటోల కనీస ధర రూ.200 కాగా, గరిష్ట ధర రూ.2.5 లక్షలని చెప్పారు. వేలం వేసే బహుమతుల్లో గణేష్, హనుమాన్ విగ్రహాలు, అంబేద్కర్, వీరశివాజీ, […] The post ప్రధాని బహుమతుల వేలానికి వేళాయే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ నెల14 నుంచి 2772 బహుమతుల వేలం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి గత ఆరు నెలల్లో వచ్చిన దాదాపు 2772 బహుమతులను ఈనెల 14 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్‌లైన్ ద్వారా వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ బుధవారం వెల్లడించారు. ఈ మెమెంటోల కనీస ధర రూ.200 కాగా, గరిష్ట ధర రూ.2.5 లక్షలని చెప్పారు. వేలం వేసే బహుమతుల్లో గణేష్, హనుమాన్ విగ్రహాలు, అంబేద్కర్, వీరశివాజీ, వివేకానంద ప్రతిమలు, 576 శాలువాలు, 964 అంగవస్త్రాలు,తదితర కళాఖండాలు, వస్తువులు ఉన్నాయి. న్యూఢిల్లీ లోని నేషనల్ మోడర్న్ ఆర్టు గ్యాలరీలో ప్రస్తుతం వీటిని ప్రదర్శనకు ఉంచారు.

ఈ ఏడాది జనవరిలో పక్షం రోజుల పాటు సాగిన వేలంలో 1900 ప్రధాని బహుమతులు అమ్ముడు పోగా ఆమేరకు వచ్చిన నిధులను గంగానది శుద్ధి కోసం చేపట్టిన నమామి గంగ ప్రాజెక్టుకు కేటాయించినట్టు మంత్రి వివరించారు. అయితే నిధుల మొత్తం ఎంతో వెల్లడించ లేదు. జనవరి వేలంలో ప్రత్యేకంగా చేతి తో తయారు చేసిన కొయ్యసైకిల్ రూ.5 లక్షలకు వేలం ధర పలికింది. అలాగే అసోం పర్యటనకు మోడీ వెళ్లినప్పుడు సంప్రదాయ హొరై బహుమతిగా మోడీకి ప్రదానం చేశారు.

వేలంలో ఆ హొరై ధర రూ.12 లక్షల వరకు పలికింది. గౌతమబుద్ధుని ప్రతిమ వాస్తవ ధర రూ.4వేలు కాగా, వేలంలో 7 లక్షల వరకు వెళ్లింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు కూడా తనకు వచ్చిన బహుమతులను వేలం వేయించి ఆ నిధుల ను బాలికల చదువులకు వినియోగించడం పరిపాటిగా సాగింది. గంగానదిని శుద్ధి చేయాలన్నలక్షంతో కేంద్ర ప్రభుత్వం 2015 మే 13న నమామి గంగ ప్రాజెక్టును ప్రారంభించింది.

Auction of Prime Minister Gifts

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రధాని బహుమతుల వేలానికి వేళాయే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: