బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి

Train-hits-Bus
కరాచీ: పాకిస్థాన్‌ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా… పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కరాచీ నుండి సర్గోదా వెళ్తున్న బస్సు కాపలా లేని కంధ్రా రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో రావల్పిండి నుండి కరాచీ వెళ్తున్న 45 అప్ పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జు అయినట్టు చెప్పారు. బస్సును రైలు దాదాపు 200 అడుగుల వరకు ఈడ్చుకెళ్లిందని తెలిపారు.
At least 20 Killed Train Hits Bus at Pakistan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.