అసుస్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్ విడుదల…

asusముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు అసుస్ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను స్పెయిన్ మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో 6.46 ఇంచుల డిస్‌ప్లేను అమర్చారు. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్, 8 జిబి ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేయడంతో ఫోన్ వేగంగా ప‌నిచేస్తుందని నిఫుణులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 9.0లో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఈ ఫోన్ లో ఉంది. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ గల కెమెరాను అమర్చారు.

అసుస్ జెన్‌ఫోన్ 6 ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, ట్విలైట్ సిల్వ‌ర్ క‌ల‌ర్ లో రిలీజ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6 జిబి ర్యామ్‌, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.39,132 ధ‌ర‌కు కస్టమర్లకు అందుబాటులో ఉంది. అలాగే 6 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.43,800 ధ‌రకు, 8జిబి ర్యామ్‌, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.46,970 ధ‌ర‌కు వినియోగదారులకు ల‌భ్యం కానున్నాయి. మే 25వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను పలు రకాల వెబ్ సైట్ లలో మొబైల్ స్టోర్స్ లో అమ్మనున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచ‌ర్లు…

6.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌,

6/8 జిబి ర్యామ్‌, 64/128/256 జిబి స్టోరేజ్‌,

1 టిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,

48, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,

డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Asus Zenfone 6 launched

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అసుస్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.