ఆకట్టుకునే ఫీచర్లతో ఏసుస్ 6జెడ్ స్మార్ట్‌ఫోన్…

 

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 6జడ్‌ను బుధవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించనున్న ఈ ఫోన్ జూన్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్ కెమెరా ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఏసుస్ 6జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో 48+13 మెగాపిక్సెల్ మోటరైజ్డ్ రొటేటింగ్ కెమెరా ఉంటుంది. ఇదే కెమెరా రియర్, సెల్ఫీ కెమెరాగా పనిచేయడం విశేషం. అంటే ఫోన్ వెనుక వైపు ఉండే కెమెరా రియర్ కెమెరాగా పనిచేస్తుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో కెమెరా ముందువైపు రొటేట్ అవుతుంది.

అసుస్ 6జడ్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.31,999 ధరకు లభించనుండగా.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.34,999గా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.39,999 గా ఉంది. కాగా ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.3,999 విలువైన ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కేవలం రూ.99కే అందివ్వనున్నారు.

 ఫీచర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్

6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 13 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు,

5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus 6Z smartphone launched in India

The post ఆకట్టుకునే ఫీచర్లతో ఏసుస్ 6జెడ్ స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.