ఫ్రెంచ్ క్వీన్ బార్టీ

ఫైనల్లో మార్కెటా చిత్తు, జకోవిచ్‌కు థిమ్ షాక్ పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆశ్లే బార్టీ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. బార్టీ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇంతకుముందు 2018లో యూఎస్ ఓపెన్‌లో కూడా సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఆస్ట్రియా సంచలనం, నాలుగో సీడ్ డొమినిక్ థిమ్‌తో […] The post ఫ్రెంచ్ క్వీన్ బార్టీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫైనల్లో మార్కెటా చిత్తు, జకోవిచ్‌కు థిమ్ షాక్
పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆశ్లే బార్టీ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. బార్టీ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇంతకుముందు 2018లో యూఎస్ ఓపెన్‌లో కూడా సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఆస్ట్రియా సంచలనం, నాలుగో సీడ్ డొమినిక్ థిమ్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగే ఫైనల్లో థిమ్ స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో తలపడుతాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో ఊహించినట్టే బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 8వ సీడ్ బార్టీ 61, 63 తేడాతో చెక్ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసొవాను చిత్తు చేసింది. సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరిన మార్కెట్ తుది పోరులో చేతులెత్తేసింది. ఫైనల్ పోరులో బార్టీ ప్రారంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. మార్కెట్ మాత్రం కనీస పోటీ కూడా ఇవ్వడంలో విఫలమైంది. ఈ టోర్నీలో అసాధారణ ఆటతో ఆకట్టుకున్న బార్టీ ఫైనల్లో కూడా అదే జోరును కనబరిచింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడింది. బార్టీ కొట్టిన షాట్లకు మార్కెటా వద్ద సమాధానం లేకుండా పోయింది. తొలి సెట్‌లో బార్టీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థిని కోర్టు నలుమూలలా పరిగెత్తించిన బార్టీ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా బార్టీకి ఎదురు లేకుండా పోయింది. ప్రారంభం నుంచే చెలరేగి ఆడింది. బార్టీని నిలువరించడంలో మార్కెటా పూర్తిగా విఫలమైంది. దూకుడుగా ఆడిన బార్టీ ఆడుతూ పాడుడూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. మరోవైపు ఫైనల్లో గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన మార్కెటా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
థిమ్ సంచలనం
మరోవైపు పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థిమ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన ఐదు సెట్ల హోరాహోరీ సెమీస్ సమరంలో థిమ్ 61, 36,75, 57, 75 తేడాతో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్‌పై సంచలన విజయం సాధించాడు. వర్షం వల్ల పలుసార్లు వాయిదా పడ్డ పోరులో ఇటు థిమ్, అటు జకోవిచ్ సర్వం ఒడ్డి పోరాడారు. తొలి సెట్‌లో థిమ్ అలవోకగా విజయం సాధించాడు. కళ్లు చెదిరే షాట్లతో జకోవిచ్‌ను హడలెత్తించిన థిమ్ సునాయాసంగా సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి జకోవిచ్ ఆధిపత్యాన్ని చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ థిమ్‌ను కంగుతినిపించాడు. ఇక, మూడో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో థిమ్ విజయం సాధించాడు. కాగా, నాలుగో సెట్‌లో మళ్లీ జకోవిచ్ జోరును ప్రదర్శించాడు. ఈసారి కూడా ఫలితం టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో జకోవిచ్ పైచేయి సాధించాడు. ఇదిలావుండగా ఫలితాన్ని తేల్చే ఐదో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఒకదశలో 15తో వెనుకబడిన జకోవిచ్ అసాధారణ పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు. అయితే చివరి వరకు నిలకడగా ఆడిన థిమ్ 75తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
నేడు నాదల్‌తో తుది సమరం
ఇక, ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్‌తో థిమ్ తలపడుతాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నాదల్ అలవోక విజయాలతో మరోసారి టైటిల్ పోరుకు దూసుకొచ్చాడు. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో థిమ్‌ను ఓడించి తన ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ జమ చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. కాగా, కిందటిసారి ఫైనల్లో నాదల్ చేతిలో ఓటమి పాలైన థిమ్ ఈసారి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నాడు. అయితే మట్టి కోర్టు రారాజుగా పేరు తెచ్చుకున్న నాదల్‌ను ఓడించి టైటిల్ సాధించడం అనుకున్నంత తేలిక కాదు.

Ashleigh Barty gets French Open 2019 title

The post ఫ్రెంచ్ క్వీన్ బార్టీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.