మరో మహాభారత యుద్ధం జరగాలా?

Asaduddin Owaisi

 

తమిళస్టార్ రజనీపై ఒవైసి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: అమిత్‌షా, మోదీలు కృష్ణార్జనులైతే కౌరవులు, పాండవులు ఎవరని తమిళస్టార్ రజనీకాంత్‌పై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన తీరు, విధించిన ఆంక్షలపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపి. అసదుద్దీన్ ఒవైసీ బుధవారం దారుస్సలాంలోని విలేఖరులతో ఆయన మాట్లాడారు. రజనీ కాంత్ మోదీ-, షా పాలనపై చేసిన కామెంట్లు దేశంలో మరో మహాభారత యుద్దం జరగాలని కోరుకుంటున్నారా..? అని ఓవైసీ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ ఉద్ధండులైన జవహర్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, అయ్యంగార్ వంటి నేతలకు ఉన్న దూరదూష్టి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఏమాత్రం లేదన్నారు. రాజ్యంగంలోని పౌరహక్కులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 80లక్షల మంది ప్రజలను నిర్భంధించారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని పరిస్థులు ఎమర్జెన్సీలా తలిపింపజేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇందిరాగాంధికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అసద్ ఆరోపించారు. జమ్మూకశ్మీర్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి మచ్చుకైనా ప్రేమ లేదన్నారు. స్వీయ రాజకీయ లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. గతంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి చేసుకున్న ఒప్పందాలను తుంగలోకి తొక్కారని ఆయన విమర్శించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ-, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలను కృష్ణార్జునులుగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

వరద బాధితులకు రూ.20లక్షల సహాయం
వరదల బారిన పడిన కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు మజ్లిస్ పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపి. అసదుద్దీన్ ఒవైసీ రూ.20లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ద్వారా ఆయన తన వితరణను బుధవారం వెల్లడించారు. కేరళ రాష్ట్రంలో వరద బాధితులకు రూ.10లక్షలను, మహారాష్ట్ర వరద బాధితులకు 10లక్షల చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. నేరుగా సిఎంల సహాయ నిధికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Asaduddin Owaisi Fire on Rajinikanth

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మరో మహాభారత యుద్ధం జరగాలా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.