అప్పుడే పిల్లలా ?

  మళ్ళీ ప్రమోషన్, కంగ్రాట్స్ సంవత్సరంలో రెండోసారి నీ శాలరీ హైక్.. నువ్వు మనిషివా మరవా…’ అంది మానస. నిజమేనే బాబూ.. డే అండ్ నైట్, వరసగా రెండు ప్రాజెక్టులు, ఇంకో లాంగ్వేజ్ ప్రాక్టీస్… ఇప్పుడిక రిలాక్సయా” అంది నివేద. ‘మరింకేం… ఈ సంవత్సరం ఓ పిల్లనో, పిల్లాడినో …’ అన్నది మానస. ‘ స్టాప్…స్టాప్… ఇప్పుడేమీ ఆలోచించటం లేదు… ఇంత బిజీ షెడ్యూల్లో పిల్లలెక్కడే బాబూ…. కానీ ఫోనెత్తితే చాలు ఇటు మా అత్తగారూ, అటు […] The post అప్పుడే పిల్లలా ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మళ్ళీ ప్రమోషన్, కంగ్రాట్స్ సంవత్సరంలో రెండోసారి నీ శాలరీ హైక్.. నువ్వు మనిషివా మరవా…’ అంది మానస. నిజమేనే బాబూ.. డే అండ్ నైట్, వరసగా రెండు ప్రాజెక్టులు, ఇంకో లాంగ్వేజ్ ప్రాక్టీస్… ఇప్పుడిక రిలాక్సయా” అంది నివేద.
‘మరింకేం… ఈ సంవత్సరం ఓ పిల్లనో, పిల్లాడినో …’ అన్నది మానస.
‘ స్టాప్…స్టాప్… ఇప్పుడేమీ ఆలోచించటం లేదు… ఇంత బిజీ షెడ్యూల్లో పిల్లలెక్కడే బాబూ…. కానీ ఫోనెత్తితే చాలు ఇటు మా అత్తగారూ, అటు అమ్మా సతాయించేస్తున్నారు.. ప్రాణం తీసేస్తున్నారనుకో’ అన్నది నివేద.

“ ఇలా అంటున్నానని ఫీలవకు గానీ 30 ఏళ్లు వచ్చాయి ఇప్పటికే లేట్. ఇల్లు కొన్నారు, హైదరాబాద్ మాల్స్‌లో సగం సామాను నీ ఇంట్లో ఉంది. ఇద్దరూ బ్రహ్మాండంగా సంపాదించుకొంటున్నారు. ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు కాదనుకుంటే తర్వాత కావాలన్నా కష్టమే ఆలోచించు” అన్నది మానస.

‘భయం వేస్తోంది… కెరీర్ పోతుందేమోనని.’
“ఇంకేం భయం. ఇదివరకు 20ల్లోనే తల్లి అయ్యేవాళ్లు. పెళ్లయిన రెండు నెలలకే గర్భం వచ్చేది. ఆ వయసులో ప్రసవం సమస్యలు తక్కువ అంటారు కదా డాక్టర్లు. సిజేరియన్ అవసరం ఉండదు. ఇరవై కంటే ముందయితే మరీ చిన్నవాళ్ళు కనుక ఆరోగ్య సంగతి తెలియక పోషక పదార్థాలు తీసుకోక సమస్యలు వచ్చేవి. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పిల్లలు తక్కువ బరువుతో పుట్టి అనారోగ్యాలు వచ్చేవి.

ఇక ఇరవై ఏళ్ళు పర్లేదు. సంతానం ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ క్షేమం కోసం ప్రికాషన్స్ తీసుకోవటం, డాక్టర్ని కలవటం, పెద్దల సంరక్షణ ఇవన్నీ వీలు గనుక చక్కని పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు నీ సంగతి చూడు 30 ఏళ్ళు వచ్చాయి. ఇంకెంత లేట్ చేస్తావు..? అంది మానస.
నివేద నవ్వేసింది!
“నువ్వేంటే బాబూ పెద్ద అధ్యయనం చేసినట్లే వున్నావు.”
నీ కంటే రెండేళ్ళే పెద్ద. ఇప్పుడు పాపాయిని కన్నాను. ఎంత రిసెర్చి చేశానో… ఎన్ని రిపోర్ట్‌లు చదివానో తెలుసా.. ఒక నివేదిక ఏం చెపుతుందో తెలుసా డెన్మార్క్ లో జరిగిన పరిశోధన ఇది. 38 ఏళ్ళు దాటి గర్భం వచ్చిన వాళ్ళలో 20 శాతం గర్భస్రావాలు ఎక్కువగా ఉన్నాయట. గర్భస్థ శిశువులో లోపాలు లేవని నిర్థారించుకొనేందుకు చేసే ఏమ్నియో సెంటాసిస్ పరీక్ష ఆ వయసులో చేయరట. ఈ పరీక్షకు ప్రయత్నం చేస్తే అది గర్భస్రావానికి దారి తీస్తుంది కనుక ఆ వయసుకు వచ్చాక గర్భం ధరిస్తే, గర్భంలో ఉన్న శిశువుకు ఇతర మార్గాల ద్వారా పరీక్షలు చేసి జన్యులోపాలు లేవని నిర్థారించుకోవలసి వస్తుంది. అట్లాగే డాక్టర్ల సలహా ప్రకారం 35 ఏళ్ల తర్వాత గర్భం వస్తే డయాబెటిక్, నెలలు నిండకుండానే ప్రసవం, శిశువు బరువు లేకపోవటం, గర్భంలో ఉండగా సరిగ్గా పోషణ లేకపోవటం, ప్రసవ సమయంలో ఇబ్బందులు వస్తాయి. డెలివరీ సమయంలో రక్తస్రావం, సహజ ప్రసవం కాకపోతే సిజేరియన్ చేయటం ఇవన్నీ కామన్.’

‘అమ్మో భయం వేస్తోంది మానసా. ఇదేంటే పొద్దున్నే భయపెడుతున్నావు…’
“భయపెట్టడం లేదు తెలుసుకోమంటున్నాను. సరైన నిర్ణయం తీసుకోమంటున్నాను ఎందుకు భయం ఎన్నో ఆధునిక సౌకర్యాలున్నాయి. అయినా సరే 35 ఏళ్ళు దాటితే రిస్కే. 40 ఏళ్ళకి తల్లయిన వాళ్ళు ఉన్నారు. అసలా వయసులో గర్భం రావటం, వస్తే దాన్ని నిలుపుకొనేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. జన్యు పరమైన లోపాలు లేకుండా సంతానం పొందటం కదా మనకి కావలసింది. పుట్టే బిడ్డకు ఏదైనా సమస్య ఉంటే పుట్టిన పాపాయి, మనమూ బతికి ఉన్నంత కాలం ఎంత కష్టం చెప్పు.

‘ ఇప్పుడు ఏం చేయమంటావో సరిగ్గా చెప్పు.’
“ సరిగ్గా నువ్వే ఆలోచించుకో… కెరీర్ గ్రాఫ్ ఉజ్వలంగా ఉంది సరే బిడ్డను కనే సమయం కూడా ఇదే. పైగా నీకు పిల్లలంటే ఇష్టం. నీది ఫిట్‌నెస్ బాడీ. చక్కగా జిమ్‌కి వెళతావు, ఇప్పుడు నీ ట్రైనర్ సలహాలు ఇస్తాడు చూడు. చక్కని పాపాయిని కనాలంటే తేలికైన వ్యాయామంతో నీ శరీరం బావుంటుంది. చక్కని పాపాయి ఉంటుంది”.
“ నువ్వు ఆశ పెడుతున్నావు. నిజమే నాకు పిల్లలు కావాలి. జీవితం డల్‌గా గడవటం నాకు ఇష్టం లేదు. ఇప్పటివరకు మా ఆయన మొత్తుకుంటున్నా వాయిదా వేస్తూ వచ్చాను…”

“ సరే నీ కెరీర్ కూడా బాగానే ఉంది. సెలవు దొరుకుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంది. ఒక కొత్త రిపోర్ట్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చదువు. స్త్రీలల్లో నిర్ధ్దిష్టమైన సంఖ్యలో అండాలు ఉంటాయి. అవి ఎన్ని అనేది పుట్టుక సమయంలో నిర్ణయించబడతాయని రిపోర్ట్. ఈ అండాల్లో మొదటి అండం విడుదల ఒక వయసులో జరుగుతుంది. ఆ వయసు ఆహారం, వాతావరణం బట్టి 9 నుంచి 11 ఏళ్ళ మధ్య ఉండచ్చు. ఆ తొలి అండం విడుదల ‘ రజస్వల’ అవటం. అయితే చివరి అండం విడుదల మెనోపాజ్ అవుతుంది. ఈ రెండు దశల మధ్య కాలంలోనే సంతానం పొందగలుగుతారు. తొలి అండం విడుదలప్పుడు సహకరించిన హార్మోన్‌లు, వాటి ఉత్పత్తి స్థాయిని బట్టి మధ్య వయసులో కొనసాగించి, తల్లి అయ్యేందుకు సహకరించి ఇక ఆ తర్వాత వెనుకడుగు వేస్తాయి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు తల్లివి కావాలంటే సమయం మించిపోలేదు. ఇప్పుడే డాక్టర్‌ని కలుసుకో. వైద్యం ఎంతో డెవలప్ అయింది. ఎలాంటి లోపాల్ని అయినా సరి చేయగల మార్గాలున్నాయి. అలాగే ఇటు మీ అమ్మ, అత్తగారు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు నీ పిల్లల్ని పెంచగలిగే ఓపికతో ఉన్నారు. వాళ్ల సహాయం తీసుకోవచ్చు.”
“అవును మానస.. ఆ ఇద్దరూ ఎంత బతిమిలాడుతున్నారో మేం పెంచుతాం. నువ్వు ఒప్పుకో… పిల్లల్ని కనేందుకు” అంటారు.

“అవును నివేదా. జీవితంలో ఎన్నో అవకాశాలు ఒకే వయసులో వస్తాయి. అటు జాబ్, కెరీర్, ఇటు కుటుంబం, పెళ్లి, జీవితంలో స్థిర పడటం..ఇవన్నీ మనం బాలెన్స్ చేసుకోగలగాలి. నువ్వు వెంటనే డాక్టర్‌ను కలుసుకొని సలహా తీసుకో… పిల్లల్ని ఓపికగా పెంచగలిగే వయసు కూడా ఇదే. ఇంకా పెద్దయితే ఆ శక్తి చాలదు. ఏమంటావు”.
‘చూశావా ప్రమోషన్‌కి కంగ్రాట్స్ చెపుతావు అనుకొని ఫోన్ చేస్తే నీ ప్రసంగం వినవలసి వచ్చింది.’
“ఇదీ ప్రమోషనే. తల్లి అయ్యే ప్రమోషన్. మాతృత్వం అన్న పదం చుట్టూ ఉన్న భావజాలం గురించి మళ్ళీ నువ్వు పిల్లలు కన్నాక మాట్లాడుకొందాం కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చక్కని పాపాయిని కను. పెరిగి పెద్దయి నీకు ఫ్రెండ్‌గా ఉండే చక్కని కూతుర్ని కను.”
“ పాపాయికి పేరేం పెడదాం ’
“ ఇప్పుడే సీరియల్ సక్సెస్‌ఫుల్‌గా రెండు వేల ఎపిసోడ్స్ దాటిందో చూసి ఆ హీరోయిన్ పేరు పెడదాంలే….’

                                                                                                                          – చేబ్రోలు అరుణ
Article on Women delivery Plannings

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అప్పుడే పిల్లలా ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.