ప్రవహించే దుఃఖ నది పాలపిట్ట పాట

  వ్యక్తిత్వమే కవిత్వం అన్నాడు ఒక మహాకవి. ఒక కవిరాసిన కవిత్వాన్ని చదివితే అందులో అతని వ్యక్తిత్వం ప్రస్పుటమవుతుంది. పాలపిట్ట పాటలోని కవిత్వం చదివినప్పుడు. పైమాటలు నిజమేననిపించింది. అందులోని కవిత్వం సమాజంలోని విభిన్న పార్శ్వాలను తాకి కవిత్వం గా రూపొందిన భావన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. …../కానీ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా /నా శరీరంలోకి ఏదో ఉత్తేజం ప్రవహిస్తుంది/ కళ్ళలో కాంతితో కాంక్షతో /అప్పుడే పూసిన /పున్నాగ తరువులా ఉండేదామె!/………./ చెట్టు కింది అవ్వకు చెట్టే స్పూర్తి అయితే/ మాకు […] The post ప్రవహించే దుఃఖ నది పాలపిట్ట పాట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వ్యక్తిత్వమే కవిత్వం అన్నాడు ఒక మహాకవి. ఒక కవిరాసిన కవిత్వాన్ని చదివితే అందులో అతని వ్యక్తిత్వం ప్రస్పుటమవుతుంది. పాలపిట్ట పాటలోని కవిత్వం చదివినప్పుడు. పైమాటలు నిజమేననిపించింది. అందులోని కవిత్వం సమాజంలోని విభిన్న పార్శ్వాలను తాకి కవిత్వం గా రూపొందిన భావన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. …../కానీ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా /నా శరీరంలోకి ఏదో ఉత్తేజం ప్రవహిస్తుంది/ కళ్ళలో కాంతితో కాంక్షతో /అప్పుడే పూసిన /పున్నాగ తరువులా ఉండేదామె!/………./ చెట్టు కింది అవ్వకు చెట్టే స్పూర్తి అయితే/ మాకు మాత్రం అవ్వే స్ఫూర్తి(జీవన లాలస)అనే కవితలో బతకడానికి స్పూర్తినిచ్చిన పండ్లమ్ము కునే అవ్వను అక్షరీకరించాడు కవి.

చెట్లను స్ఫూర్తిగా తీసుకొని అవ్వ జీవిస్తుంటే మేము మాత్రం అవ్వను స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్తాం. వీధిలో సర్కస్ ఆడేవారికి ,పాములు ఆడించే వారికి కమ్మని పండ్లు అందించి పచ్చని ఆశను గుండెలో నింపేది అంటాడు అలాంటి అవ్వ బతుకు పోరాటంలో జయం పొంది విముక్తి పొందినా ఆమె జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తొస్తాయి.అని జీవితం చాలించిన అవ్వను ఎలా స్పూర్తిగా తీసుకుని నడిచాడో ఈకవిత ద్వారా చెప్పాడు. మేఘశకలం నుండి పిడుగు దూకినట్లు /అతడు విమానం నుంచి జారిపడి /ఆమెకు విడాకుల పత్రాన్ని అందిస్తాడు /కొత్త అమ్మాయితో ఏకరాత్రి/సుఖాన్ని పంచుకొని /వీధి దీపాలన్నా ఆరక ముందే /మరో ‘ఒయాసిస్సు ‘కోసం సుఖాన్వేషణ మొదలుపెడతాడు /(తడారిన గుండెలు )కవితలో పెళ్లి చేసుకొని కొంతకాలమైనా కాకుండానే డబ్బు సంపాదించడానికి విదేశాలకు వెళుతున్న భర్తను చూసి దిగులుగానే సాగనంపుతుంది మనసులో మాత్రం ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని గుబులు గా ఉంటుంది. ఎప్పుడో ఒకనాడు విమానం దిగుతూనే విడాకుల పత్రాన్ని ఇస్తాడేమో నని విడాకులతో విచ్ఛిన్నమవుతున్న బంధాలు ఆర్థిక సంబంధాలు గా మారుతున్నాయని అలాంటి స్త్రీల మానసిక సంఘర్షణకు అద్దంపడుతుంది .

చెక్క వాడి చేతిలో హొయలు హొయలు పోతుంది /కళ్ళలోని ఏకాగ్రత/ చేతి వేళ్ళ కొసల దాకా ప్రవహించి ప్రవహించి…../చెక్కముక్క చూస్తుండగానే / క్రికెట్ బ్యాట్ గా మారిపోయింది/ కాన్వెంట్ పావురాలు /చుట్టూ రా వాలి/ నచ్చిన సైజుని తీసుకు పోతున్నాయి( వృత్తం )అనే కవిత క్రికెట్ బ్యాట్ లు తయారుచేసే అతనిని దీక్షలో మునిగిపోయాడు అనడం చురుక్కున తాకే ఎండను అలలు అని వర్ణించడం తయారైన క్రికెట్ బ్యాట్ ను తీసుకెళ్లే విద్యార్థులను కాన్వెంట్ పావురాలు అనడం ఎంతో అద్భుతమైన వర్ణన లా అనిపిస్తుంది. పైకి వర్ణాలు/కనిపించినా /లోన దుఃఖనది /ప్రవహిస్తుంది/…./పదనిసల వలలో /చిక్కుకున్నది కాలం/దయ లేకుండా సాగుతున్నది /జీవన నౌక !(పాలపిట్ట పాట) అనే కవితలో వ్యక్తులు చూడటానికి నవ్వుతూ అందంగా కనిపించినా లోపల మనసు దుఃఖిస్తూనే ఉంటుంది అంటాడు ఇక్కడ నవ్వును వర్ణాలుగా ఏడుపును ప్రవాహం తో పోల్చడం గుండెలోని నీటి కొలనులు బయటకు కనిపించవు అంటాడు కవి .సమస్యల సుడిగుండంలో జీవితం సాగుతూనే ఉంటుంది .మానసిక సంఘర్షణల మధ్య నలిగిపోతున్న సగటు మానవుని మనస్సును ఈ కవిత ద్వారా ఆవిష్కరించాడు.

అంధకారంలో కి అడుగులు వేస్తూ /అవకాశాన్ని అరచేతిలోకి అందుకోవాలనే ఆశ /ఆకుపచ్చని కలలైనా కనలేని వాళ్ళం/కళ్ళలో ఎండిన ఒయాసిస్సులు అతికించుకున్నాం/…../ నేనిప్పుడు కదంబం నీడలోంచి కన్నీటి పువ్వులేరుకుంటుంన్నా‘ (కదంబం నీడలోంచి)అనే కవితలో అడవులు అంతరించిపోతున్నాయని చెప్తూ &.అంతరించిపోతున్న కదంబవృక్షానికి అపాదించాడు . కదంబం అనే అందమైన వృక్షాలు దేవతా పూజలకు సాధారణంగా ఉపయోగిస్తారు కదంబోత్సవం అనేది ఒక ప్రాంతం లో రైతులు జరుపుకునే ఒక పండుగ కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు ఈ వృక్షంలోని ప్రతి భాగం వ్యాధులకు మందుగా ఉపయోగిస్తారు .అలాంటి వృక్షాలు ఇప్పుడు కథల్లోనే వినాల్సి వస్తుందని కవి ఆవేదన కవితలో చక్కగా ఆవిష్కరించారు. వాడు సూర్యుడి కంటే ముందే /ప్రజలకింత ఉదయాన్ని /వేడివేడిగా అందిస్తాడు/ వాడి సైకిల్ రైయ్ రైయ్ మంటూ/ జగానికి నడక నేర్పుతుంది/వాడు వర్షంలో తడిసినా /ఇరానిఛాయ్ లాంటి వార్తలే తెస్తాడు /… /వార్త వర్ధిల్లుతున్నంకాలం /జీవించే చిరంజీవి /(పేపర్ బాయ్ )అనే కవితలో సూర్యుని కంటే ముందే ప్రపంచ వెలుగును మన ఇంటి ముందు గుమ్మంలో ఒంపి పోతా గుప్పెడు వార్తలను చల్లిపోతాడు వార్తలు ఉన్నంతకాలం చిరంజీవి గానే ఉంటాడు వాడే పేపర్ బాయ్ అంటూ పేపర్ బాయ్ ని ఆవిష్కరించిన తీరు వర్ణించిన విధానం కవిత చదువుతున్నంత సేపూ గుండెల్లో కలుక్కుమంటుంది.

మేఘాలు కాల్వలు కాల్వలుగా కన్నీటిని వర్షించాయి/ నీలాకాశం కడుపులోంచి శవాలు ప్రవహించాయి/ దేహాలు దేహాలు గుద్దుకొని గువ్వలు రాలి పడ్డాయి/( రక్త సముద్రం)అనే కవితలో 1994లో తూర్పు ఆఫ్రికాలోని రువాండా లోని ప్రజలు‘ టుట్సీ వర్గం రువాండా జనాబాలోని 10శాతం ఊచకోతకు గురయ్యారు “ అప్పటి ఉదంతాన్ని కవి కవిత్వీకరించిన తీరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఇప్పుడే జరిగిన విషాదంలాగా తోస్తుంది. &&./రాత్రి తన షర్ట్ ను ,టైను,/చిరునవ్వును హెంగర్ కుతగిలిస్తాడు /ఈరోజు ఇక్కడ ఉన్నవాడల్లా /రేపు ఇంకెక్కడో వికసిస్తాడు (సేల్స్ మ్యాన్ )అనే కవితలో జీవన పోరాటంకోసం కవి టిప్ టాప్ గా తయారై పేదాలకు తగిలించుకున్న చిరునవ్వును రాత్రికి హేంగర్ కు తగిలిస్తాడు అని చెప్పడం వినూత్నంగా ఉంది.

…./ పండుగొస్తుందంటే చాలు అమ్మ/ రోగిలా అవుతుంది /అర్థంకాని మాటలేవో అమ్మ నోట్లోంచి/ కింద పడి ముక్కలైన ప్రతిమలవుతాయి /గదులన్నీ తలంటు పోసుకున్న స్త్రీలవుతాయి/ అమ్మ ఊళ్లోని మందిరాలను పరామర్శిస్తారు ఉంది/(గుండెగంటను మ్రోగించు) అనే కవిత లో ప్రతిరోజు ఉన్నట్లుగా మనుషులు ఎందుకు ఉండరు ?పండుగనాడు శుభ్రత అంటూ హడావుడి చేస్తారు గుడి నిండా కృత్రిమ వాతావరణం ఏర్పడుతుంది అంటాడు కవి.కోర్కెలలిస్ట్ చెప్పుకోవడానికి క్యూలైన్లో నిలబడి మంత్రాలు వల్లిస్తారందరూ వాళ్ళ అమ్మ మాత్రం పండుగ వస్తుందంటే చాలు రోగిలా తయారవుతుంది అంటాడుకవి.తల్లి పై ఉన్న ప్రేమ ఈ కవిత ద్వారా ఆవిష్కరించాడు్…../వాడిపోయిన పూ రేకులు /ఇంద్రధనువును తుంచి/ఆసుపత్రి పడక మీద చల్లినట్టు /వలవిసిరి పిల్ల పావురాల్ని/ పట్టింది జ్వరం( ఆసుపత్రిలో పువ్వులు &.)అనే కవితలో జ్వరాలతో ఆసుపత్రిపాలైన పసిపిల్లల ఆర్తనాదాలను కవిత్వీకరించడంలో కవి మనసు ఎంత సున్నితమైన లో అర్థమవుతుంది.

&./పలక చెట్టుపై అక్షరాల పిట్టల్ని/ పొదివి పెట్టుకోవాల్సిన పాప/ హార్మోనియం పెట్టెపై /జీవన రాగాన్ని శ్రుతి చేస్తుంది/&…/జతల జతల కళ్లు మ్యాగజైనుల/ఊబిలోకిదిగిపోతాయి/( వెంటాడే పాట )అనే కవితలో తాను ప్రయాణించే రైలులో పాట పాడి జీవనం సాగిస్తున్న పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో ఉన్న పాప హార్మోనియం తో పాట పాడి జీవనం సాగిస్తున్న తీరును చూసి కవిత్వీకరించిన తీరు చూస్తే ఆ పాపను చూసి కవి హృదయం ఎంతలా విలవిలలాడి పోయిందో అర్థమవుతుంది …./భూమి గుండెకు గాయం చేసి చేసి /గాలి పిండుకుంటే సాద్వికి సైతం కోపం రాదూ?/భూమి తల్లి గాఢ విశ్వాసమే బ్లో ఔట్!!(అగ్నిశిఖ) అనే కవితలో అడవులు అన్నింటిని కొట్టివేసి నదుల్లో బావుల్లో నీరు లేక పంటలన్నీ ఎండిపోయి. బతికే దారి లేక వలస పోతున్నది కొందరైతే బోర్లు వేసి భూమిని జల్లెడ పడుతుంటే భూతల్లి కోపంతో అగ్నిని వెదజల్లుతుంది అంతరించిపోతున్న అడవులను చెదిరిపోతున్న పచ్చదనాన్ని ఆవేదనతో కవిత్వీకరించారు కవి.

అనాచ్చాదిత నగర దేహంపై /పరుచుకునే మంచుదుప్పటి /సన్నగా స్ప్రింగ్ లా వణికే/ఇల్లు/పక్కపై ఎటు దొర్లినా / కౌగిలించుకొనే మంచు ముద్దలు /&…/ఇప్పుడు నగరం ఒక ఇగ్లూ/ఎవరైనా సరే /దేహంలో దీపం వెలిగించుకోవాల్సిందే (నగరం ఒక ఇగ్లూ) అనే కవితలో చలికాలం మంచు కురిసే సమయంలో ఎటుపక్క దొర్లినా మంచు ముద్దలు తగిలినట్లు ఉంటుంది అని ఎవరైనా వెచ్చని గూటి కోసం వెతకాల్సిందే అంటూ చలికాలాన్ని చక్కని కవితగా ఆవిష్కరించారు కవి. తన ప్రయాణాన్ని/మంచు పల్లకిలో ఊరేగిస్తాడు/ చంద్రుడిలా చల్లదనాన్ని పంచి/ తాను సూర్యుడిలా /ఆకలితో మాడి పోతాడు /&&./వాడిని పలకరిస్తే చాలు/ తొలి పొద్దు ఆకుల నుండి రాలిన/ మంచు బిందువవుతాడు/( ఐస్ క్రీం పిల్లగాడు) అనే కవితలో బతుకు జీవనం సాగడం కోసం ఐస్ క్రీం బండి నడిపిస్తూ ఆకలి సరిహద్దురేఖ దాటలేక అలసి పోతున్నాడంటూ ఆపిల్లాడిని వర్ణించిన తీరు కవి యొక్క సునిశిత దృష్టి కనిపిస్తుంది.

అన్న కంచంలో కన్నీళ్లు కనిపిస్తే /అంగడిలో అన్నదాత ఆగమెందుకైతడో /…/ ఎద్దు ఏడిస్తే రైతుకు నష్టం/ రైతు ఏడిస్తే రాజ్యానికి అరిష్టం( రైతు పాట) అనే కవితలో పొలాన్ని నమ్ముకొనివ్యవసాయం చేసిన రైతుకు తినడానికి తిండి లేక కంటతడి పెడుతున్నాడు ఎద్దు ఏడిస్తే రైతుకు మాత్రమే నష్టం అదే రైతు ఏడిస్తే దేశానికే అరిష్టం అంటూ రైతులను ఆదుకోవాలని తన ఆవేదన వెలిబుచ్చాడు. ../మనసు గాయాలకు వెన్నెల ముక్కల్ని/ తెచ్చి కట్టు కడతారు /&…/మనసు కల్లోల కడలిలో/ నువ్వు వణుకుతున్నకాగితప్పడవవుతుంటే/తెరచాపలెత్తుతారు. (స్నేహనది) అనే కవితలో స్నేహం యొక్క మాధుర్యం ఎంత గొప్పదో చక్కగా కవిత్వీకరించారు కవి. నా కళ్ళు ఇప్పుడు నిశిత నేత్రాలు /నేనిప్పుడు నివురుగప్పిన నిప్పును/రోడ్లిప్పుడు వాళ్ల అదృశ్య సుప్తాస్థికలు/నా ప్రతి కణంలోకి ప్రవేశిస్తున్నాయి/( నేను మళ్ళీ వస్తున్నాను) అనే కవితలో ని పైపాదాలు ఎన్నో భావాలను పలికిస్తున్నాయి.

వస్తువులకు బ్రాండ్ నేమ్ వున్నట్లే /జనాలకు వలస పేర్లున్నాయి/పాలమూరో మరో ఊరో కావచ్చు కానీ/ తెలంగాణ మొత్తమే కదులుతున్న /కుంపటైంది /గుండెలను తాకిన పాటెక్కడికి వెళ్ళింది /నా పాటెంత పరాయిదయ్యింది(రెండు వలసలు) అనే కవిత మన భాషకు మన యాస కు జరిగిన అవమానాన్ని వివక్షతను ఎండగడుతూ నా ప్రాంతంలోనే నన్ను పరాయి చేస్తారా అంటూనిలదీసిన తీరు తన కవిత ద్వారా ప్రశ్నించిన తీరు చక్కగా ఉంది.నేలలో నీటి నడకలా నాన్న పాలన సాగుతుంది/పక్షులన్నీ చెట్ల కొమ్మల మీదికి చేరినట్లు/ పొలం పొలం అంటూ పలవరిస్తూ గింజ రాని నేలలో జీతం రాళ్ళని చల్లావు నాన్నా పక్షపాతం తెలియని నీకు పక్షవాతం రావడం ఏంటి నాన్నా/(నాన్న నేల )అనే కవితలో నాన్నతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం కవికి ఉన్న ఆత్మీయత నేర్చుకున్న క్రమశిక్షణ, ప్రేమ అబ్బురం అనిపిస్తుంది ఇలా సుంకర రమేష్ రాసిన పాలపిట్ట పాట కవితా సంపుటిలోని కవిత్వంలో వస్తు వైవిధ్యం ఉండిచక్కని శిల్పాలతో మంచి ప్రతీకలు వాడుతూ చెప్పదలచుకున్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేవిధానం బాగుంది. తన కుటుంబంలోని వ్యక్తుల పట్ల సమాజంలోని రుగ్మతల పట్ల తెలంగాణలోని ప్రజలకు మాట్లాడే భాషకు జరుగుతున్న నిరాదరణ పట్ల ,తరిగిపోతున్న వనాలపట్ల, అంతరించిపోతున్న మానవీయ విలువలు, సంబంధాలు, ఇలా ఒక్కటేమిటి 54 కవితలు దేనికదే విభిన్నంగా ఉంటాయి. మూడు దశాబ్దాల తన జీవితానుభవాలు కవిత్వీరించి అప్పటి సామాజిక స్థితి గతులు నేటి పరిస్థితులూ అవగతం అవుతాయి.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రవహించే దుఃఖ నది పాలపిట్ట పాట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: