ఖుర్‌ఆన్ పుట్టింది అజ్ఞానాన్ని తుద ముట్టించింది

  ఖురాను అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. (దివ్యఖుర్‌ఆన్ 2: 185), మేము దీని (ఖురాన్)ని ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ […] The post ఖుర్‌ఆన్ పుట్టింది అజ్ఞానాన్ని తుద ముట్టించింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖురాను అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. (దివ్యఖుర్‌ఆన్ 2: 185), మేము దీని (ఖురాన్)ని ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. (దివ్యఖుర్‌ఆన్ 97:1-5)

ఖుర్‌ఆన్ గ్రంథానికి; రమజాన్ మాసానికీ అవినాభావ సంబంధాన్నిపై ఖుర్‌ఆన్ వాక్యాలు స్పష్టం చేస్తున్నా యి. రమజాన్ నెలను ముస్లింలు ఇంత పవిత్రంగా భావించడానికి కారణం ఖుర్‌ఆన్ అవతరణే. అసలు ఖుర్‌ఆన్ అంటే మాటిమాటికీ చదవే గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా వీటిని కంఠతా చేసినవారున్నారు. వారినే హాఫిజ్‌లు అంటారు. ఖుర్‌ఆన్‌లోని 114 అధ్యాయాలలో ఆరు వేలకుపైచిలుకు వాక్యాలున్నాయి. ఖుర్‌ఆన్ హాఫిజ్‌లు తప్పుల్లేకుండా నమాజులో చదువుతారు. ఏడాదిలో ఒక్కసారైనా ఖుర్‌ఆన్ వినాలన్న నిబంధనతో.. రమజాన్ నెలలో మ్పు రోజుల పాటు ఖుర్‌ఆన్‌ను ఒక్కసారి సంపూర్ణంగా వింటారు. ఖుర్‌ఆన్‌లోని ప్రతీ వాక్యమూ మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.

మానవాళికి ఖుర్‌ఆన్ లాంటి మహత్తర గ్రంథాన్ని అందించిన అల్లాహ్ ఉద్దేశం ఏమిటంటే ఈ గ్రంథాన్ని కేవలం వల్లెవేయడం కాదు; మన దైనందిన జీవితంలో ఆచరించాలి. ఈ గ్రంథరాజాన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్లు ఎన్నటికీ దారి తప్పలేరని ప్రవక్త (స) ఉద్బోధ. దైవగ్రంథంలోని బోధనలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు. ఎన్నో రుగ్మతలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఖుర్‌ఆన్ స్వయంగా పేర్కొంటోంది. ‘ఖుర్‌ఆన్ జ్ఞానాన్ని పొంది, దానిని ఇతరులకు బోధించేవారు మీలో అందరికన్నా శ్రేష్ఠులు” అన్నది ప్రవక్త బోధన. ఖుర్‌ఆన్ చదివే వారిపై ప్రశాంతత ఆవరిస్తుంది.

ఖుర్‌ఆన్ చదివేవారిని ఖుర్‌ఆన్ ప్రళయం రోజున సిఫారసు చేస్తుందని అందువల్ల ఖుర్‌ఆన్‌ను పఠిస్తూ ఉండాలని ప్రవక్త (స) హితవుగరిపారు. “దివ్యగ్రంథంలోని ఒక్క అక్షరాన్ని పఠిస్తే, దానికి బదులుగా అతనికి ఒక పుణ్యం లిఖించడబుతుంది. ప్రతి పుణ్యానికి పదింతల ప్రతిఫలం ఉంది. ఖుర్‌ఆన్ అన్ని కాలాల పీడనలు, సంక్షోభాల నుండి గట్టెక్కిస్తుంది. “మీకన్నా ముందు గడిచిన జాతుల పట్ల ఏం జరిగింది; ఇంకా మీ తరువాత వచ్చే జాతుల పట్ల ఏం జరుగనుందో, ఇంకా మీ వ్యవహారాల పర్యవసానం ఏమై ఉంటుందో కూడా ఖుర్‌ఆన్ వివరిస్తుంది. మనిషి గుణపాఠం గరిపేందుకు ఖుర్‌ఆన్‌లో ఎన్నో గాధలున్నాయి. చిన్న చిన్న మలుపులతో, గొప్ప గొప్ప సందేశాలతో ఎన్నో కథలున్నాయి. అవన్నీ మనిషికి గుణపాఠాలు నేర్పుతాయి. మంచిని బోధిస్తాయి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కనువిప్పు కలిగిస్తాయి.

వాటిని చదువుతున్నంతసేపు మన గురించే ఉందే అనిపిస్తుంటుంది. మనోవ్యాకులత, ఒత్తిడి, ఆందోళన, మార్గం కానరానప్పుడు ఖుర్‌ఆన్ చదివితే తప్పక మార్గం దొరుకుతుంది.ప్రశాంతత ఆవరిస్తుంది. ఖుర్‌ఆన్ వాక్యాల్లో మానవమాత్రుడిపై అనిర్వచనీయమైన అల్లాహ్ ప్రేమ కనపడుతుంది. చేయి పట్టి ఆ పరమాత్ముడు దారి చూపిస్తున్నాడా అనిపిస్తుంటుంది. నిత్య జీవితంలో మంచి చెడులను విడమర్చి చెప్పే ఖుర్‌ఆన్ వాక్యాలు ఎన్నో సమస్యలకు జవాబు చెబుతాయి. హద్దులు దాటే వారికి హెచ్చరికలూ ఉన్నాయి. హక్కులు నిర్వర్తించే వారికీ స్వర్గ శుభవార్తలూ ఖుర్‌ఆన్‌లో ఉన్నాయి. ఖుర్‌ఆన్‌లోని దైవాదేశాలపై యోచించి, ఆచరిస్తే స్వర్గవనాలున్నాయన్నది ఖుర్‌ఆన్ శుభవార్త. ఖుర్‌ఆన్ పుణ్యాన్ని ప్రపంచంలోనే పొందడానికి ప్రయత్నించడం అవివేకమే అవుతుంది.

ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా సమీపంలోని హిరా గుహలో ఏకాంతంగా గడుపుతున్న రోజులవి. ఆ చీకటి గుహలో ఒంటరిగా ఉంటూ ఎన్నో రాత్రులు చింతనలో గడిపేవారు. ఇంటి నుంచి తమ వెంట భోజనాన్ని తీసుకెళ్లేవారు. ఆ గుహలో ఉన్నప్పుడు జిబ్రీల్ దైవదూత ప్రత్యక్షమయ్యారు. ‘చదువు’ అని అన్నారు. దానికి ప్రవక్త ‘నేను చదువుకున్న వాణ్ణి కాదు’ అని జవాబిచ్చారు. జిబ్రీల్ ప్రవక్త (స)ను వాటేసుకుని గట్టిగా అదిమారు. ఆ తరువాత చదువు అని పురమాయించారు. రెండోసారి కూడా మళ్లీ గట్టిగా కౌగిలించుకుని అదిమారు. ఇలా మూడు సార్లు జరిగిన తరువాత “చదువు, సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ని పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృజించాడు. చదువు, నీ ప్రభువు పరమ దయాళువు’ ఈ వాక్యాలే ఖుర్‌ఆన్ అవతరణకు నాందీ వచనమయ్యాయి. దైవవాణి వచ్చిన విషయాన్ని ప్రవక్త (స); తన సతీమణి హజ్రత్ ఖదీజాకు మొదట వివరించారు. ఆమె ప్రవక్త (స)కు బాసటగా నిలిచారు.

తన దాంపత్య జీవితంలో ఎవరికీ ఏ హానీ తలపెట్టని, ఎప్పుడూ అబద్ధమాడని తన భర్త చెప్పినది ముమ్మాటికీ నిజమని తెలిసిన పండితుల దగ్గరకు ప్రవక్త (స)ను తీసుకెళ్లారు. వాళ్లు కూడా ప్రవక్త (స)ను ధ్రువపర్చారు. ‘ఒక్కోసారి దైవదూత మానవాకారంలో నా దగ్గరకు వస్తాడు. నాతో మాట్లాడుతాడు, అతను చెప్పిన దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను” అని ఖుర్‌ఆన్ అవతరణ క్రమాన్ని ప్రవక్త (స) తన శిష్యులకు చెప్పేవారు. ఈ గ్రంథరాజం ఒకేసారి అవతరించ లేదు. ఎన్నో హితవులతో, హెచ్చరికలతో, శుభవార్తలతో, మరెన్నో గాథలతో అప్పటి అవసరాలకు అనుగుణంగా అవతరించింది. ఇలా 23 ఏళ్లలో ఖుర్‌ఆన్ అవతరణ పూర్తయ్యింది. దివ్య ఖుర్‌ఆన్ ఏ శైలిలోనయితే అవతరించిందో ఆ శైలిలోనే ఇప్పటికీ నిక్షిప్తమై ఉంది. 15 వందల సంవత్సరాలక్రితం అవతరించిన ఈ గ్రంథంలో సృష్టి గురించి, విశ్వం గురించి, సముద్రపు లోతుపాతులను గురించి, అంతరిక్షం గురించి చర్చించిందంటే ఇది ముమ్మాటికీ దైవ గ్రంథమే! ఇందులోని వాక్యాలు చదివితే ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.

Article about Interpretation of the Noble Quran

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఖుర్‌ఆన్ పుట్టింది అజ్ఞానాన్ని తుద ముట్టించింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: