‘అభ్యుదయ సృజన ఒక మేధో బాధ్యత’

  తెలుగు సాహిత్యంలో భావ విప్లవం బలపడి తీక్షణ కాల్పనికత వీస్తున్న రోజుల్లో చైనాదేశంలో నవ సాంస్కృతికోద్యమం(New Cultural Movement) నడిచింది. దీని నాయకుల్లో హు షిహ్(1862-1962)ఒకరు.ఈయన వ్యవహారిక సత్తావాదాన్ని స్థాపించి చైనా పునర్నిర్మాణ వాదానికి విద్యా పరంగా సాహిత్య పరంగా మద్దతు ఇచ్చిండు.1939 లో నోబెల్ పురస్కారానికి నామినేట్ అయిన హు షిహ్ భారతీయ సంస్కృతికి ‘India conquered and dominated China culturally for twenty centuries without ever having to send […]

 

తెలుగు సాహిత్యంలో భావ విప్లవం బలపడి తీక్షణ కాల్పనికత వీస్తున్న రోజుల్లో చైనాదేశంలో నవ సాంస్కృతికోద్యమం(New Cultural Movement) నడిచింది. దీని నాయకుల్లో హు షిహ్(1862-1962)ఒకరు.ఈయన వ్యవహారిక సత్తావాదాన్ని స్థాపించి చైనా పునర్నిర్మాణ వాదానికి విద్యా పరంగా సాహిత్య పరంగా మద్దతు ఇచ్చిండు.1939 లో నోబెల్ పురస్కారానికి నామినేట్ అయిన హు షిహ్ భారతీయ సంస్కృతికి ‘India conquered and dominated China culturally for twenty centuries without ever having to send single soldier across her borders‘ అంటూ1937 లో హార్వర్డ్ యూనివర్శిటీ ప్రసంగంలో నీరాజనం పట్టిండు.సమాజంలో సాహిత్యంలో చోటుచేసుకునే మార్పులు పరిణతి దిశగా సాగినప్పుడే చైతన్యం నూరు పూలుగా వికసిస్తుందన్నడు. 1917 జనవరిలో బీజింగ్ నుండి వెలువడిన కమ్యూనిస్టు సిద్ధాంత పత్రిక ’న్యూ యూత్’ కు హు షిహ్ రాసిన ’A Preliminary Discussion of Literay Reform’అనే విమర్శా వ్యాసం ఎంతో విలువైనది.ఇందులో ప్రతిపాదించిన ఎనిమిది అంశాలు కొత్తదనం అన్నింటా కోరుకునే కవులకు రచయితలకు మార్గదర్శకాలు.ఈ వ్యాసం కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన థియోడర్ డి బెరీ మరియు రిచర్డ్ లుఫ్రినో లు సంయుక్తంగా సంకలనం చేసిన ’సోర్సెస్ ఆఫ్ చైనీస్ ట్రెడిషన్- వాల్యూమ్-2, కొలంబియా యూనివర్సిటీ ప్రెస్,2000’లో అందుబాటులో ఉంది.
కొలంబియా విశ్వవిద్యాలయం లో తత్వశాస్త్ర పరిశోధకుడిగా( 1917)ఉన్న సమయంలో జాన్ డ్యూయీ ప్రభావానికి హు షిహ్ లోనయ్యిండు. పరిశోధనానంతరం మాతృదేశానికి తిరిగి వచ్చి, తన గురువు డ్యూయీ స్థాపించిన ప్రాగ్మాటిజానికి జీవితకాలం ప్రచారకుడిగా కొనసాగిండు.పెకింగ్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేసి చైనా విద్యా రంగాన్ని విస్తృతంగా ప్రభావితం చేసిండు.’May Four Movement’ కు ముఖ్య భూమిక నిర్వహించిన హు షిహ్ చైనా ఆధునిక కవిత్వానికి ఆద్యుడిగా నిలబడిండు.చైనా పునర్వికాసం మీద విరివిగా రచనలు చేసిండు. వినూత్న సాహిత్య సృష్టికి హు షిహ్ విశ్వసించి ఉద్ఘాటించిన ‘I believe that literary refo rm’ at the present time must begin with these eight items:(1)Write with subst ance.(2)Do not imitate the ancients.(3) Emphasize grammar. (4).Reject melan choly.(5) Eliminate old cliches.(6)Do not use allusions.(7) Do not use couplets and parallelisms. And(8) Do not avoid popular expres sions or popular forms of characters‘ ఈ సూచనలు సాహిత్య మౌలిక లక్షణాల్ని లోతుగా పట్టిస్తూ వినూత్నతకు పాదు వేస్తవి.Write with substance అంశం క్రింద అనుభూతికి ఆలోచనకు రచనలో ప్రాధాన్యత ఉండాలన్నడు.కేవలం పదజాలం , వాక్యం సముదాయం,స్వరలయల కూర్పు రచన కాదు.రచనకు అనుభూతే ఆత్మ అని, జ్ఞానం, ఆదర్శం,ఒక దివ్యచక్షువు రచనలోని ఆలోచన ద్వారా పాఠకులకు అందాలన్నడు హు షిహ్. Do not imitate the ancients అంశంలో సాహిత్యం కాలవాచి, మార్పుకు సూచి అని,పాత కథల ఎత్తిపోతల వలన లాభం లేదని ,కవులు రచయితలు వస్తురూపాల్లోఎవరి స్వంత ముద్ర వారికి ఉండాలన్నడు.గ్రామ్య జీవద్భాష జీవనేతివృత్తాలు ఘనమైన సాహిత్యం అవుతాయన్నడు. Emphasize Grammar అనే అంశంలో వ్యాకరణం పట్ల చులకన,నిరాదరణ సాహిత్య వేత్తలకు పనికిరాదన్నడు.భాషకున్న రాజస్వ నియమావళిగా భాషా ప్రాదేశికతగా వ్యాకరణాన్ని అభివర్ణించిండు. Reject melancholy గురించి ప్రస్తావిస్తూ-యువతరానికి సృజన పట్లగల మోహోద్రేకం కలం పేర్ల విషయంలో కావచ్చు,కాలస్వభావాన్ని చిత్రించడంలో కావచ్చు జ్ఞాన పైత్యంగా మారకూడదన్నడు. Eliminate old cliches అంటూ మూసవిధానాన్ని తీవ్రంగా నిరసించిండు. ఎవరైతే స్వీయభాషను, సొంత గొంతుకను, స్వీయానుభవాలను రచనలో రక్తి కట్టించలేరో, ఎవరికైతే own terms of description ఉండదో వాళ్లను సాహిత్య సోమరులుగా పేర్కొన్నాడు. Do not use allusions లో పూర్వకవులు చెప్పిన సాదృశ్యాలను,జాతీయాలను, చారిత్రక ఘట్టాలను,సామ్యతలను,ఉంటంకింపులను యధాతథంగా అరువు పుచ్చుకోవడం హీనత్వంగా,అసమర్ధతగా పేర్కొన్నడు. Do not use couplets and parallelism అంటూ మానవ భాషకు సమాంతరత్వం ప్రత్యేక లక్షణమైనప్పటికీ , ఆయా కవుల ద్విపదలను, శ్లోకాలను తిరిగి చెప్పడం,కథా కథనాల్లో వర్ణనల్లో సమాంతరత్వం హేయమైన చర్యగా క్షీణతగా తిరస్కరించిండు. Do not avoid popular expressions or popular forms of characters అంటూ ప్రజలకు అర్థం అయ్యే జీవనోక్తులు ,జీవద్రూపాలు సహజంగా వాటికవే అలంకారంగా ఔచిత్యంగా ప్రాకృతికతగా రూపొందుతున్నపుడు కావాలని పరిహరించడం సాహిత్యమర్యాద కాదని
వివరణ ఇచ్చిండు. Dead expressions కు స్వస్తి పలికి living expressions కు స్థానం కల్పిస్తే రచనలకు జీవం జవం సమకూరుతాయన్నడు. నీరసం నిస్సత్తువ నిర్లిప్తత నిస్పృహ సమాజాన్ని ముంచేస్తున్న సమయాల్లో, రొట్టకొట్టుడు వేలంవెర్రి అనుకరణ అచేతనం కళారంగాన్ని ఆవరించిన సందర్భంలో సాహిత్యమే పరిష్కారానికి దారి చూపే అంతిమ యోధ.అన్ని కాలాల్లో,అన్నిసమాజాలల్లో రచన యోధగా తయారు కావడానికి కావల్సిన సూచనలను సలహాలను నిర్మొహమాటంగా ప్రకటించి సాహిత్యాభివృద్ధిలో అభ్యుదయ సృజన ఒక మేధో బాధ్యత (Intellectual Responsibility)ను ఇట్లా ‘ Only who we realize that there is no eternal, unchanging truth or absolute truth can we around in ourselves a sense of int ellectual responsibility. ‘ అని గుర్తు చేసిండు .సాహిత్యం లో వచ్చిన మార్పులు సమాజంలో కనిపించడం ఒక నింపాది పద్ధతి అయితే, సమాజంలో వచ్చిన పరిణామాలు సాహిత్యంలో కనిపించడం అనేది రెండో పద్ధతి అత్యంత వేగవంతమైనది.ఈ రెండిటిలో ఏ పద్ధతిలో స్పందించేవారికైనా హు షిహ్ ఎనిమిది సూత్రాలు అభ్యసించి అనుసరించదగినవి.

డా.బెల్లి యాదయ్య, 9848392690

Article about China leader Hu shih

Related Images:

[See image gallery at manatelangana.news]