బాలసాహిత్యంతో భవితకు బాటలు

  దోరవేటి 11 ఫిబ్రవరి 1961లో జన్మించాడు. అమ్మ ఉప్పరి ఈశ్వరమ్మ, నాన్న అడివయ్య రంగారెడ్డి జిల్లాలోని దారూరు (దోరవేటి) స్వంత ఊరు. ఆయన పిల్లల హృదయాన్ని తనలో ప్రతిష్టింప చేసుకున్నాడు. వారికోసం అనేక సాహిత్య ప్రక్రియలనుతీసుకున్నాడు. రూపకం(భువన విజయం), నాటికలు, లఘు నాటికలు, గేయాలు, గేయ నాటికలు, నృత్య నాటికలు, ఏకపాత్రలు, సంవాదాలు శతకం, నవలిక, కథ ప్రక్రియ బాలసాహిత్యానికి ఊపిరినిస్తాయి. ఆయన పాఠ్యపుస్తక రూపకల్పన కమిటి సభ్యులు పాఠశాల బాలల వార్షిక సంచిక సంపాదక […]

 

దోరవేటి 11 ఫిబ్రవరి 1961లో జన్మించాడు. అమ్మ ఉప్పరి ఈశ్వరమ్మ, నాన్న అడివయ్య రంగారెడ్డి జిల్లాలోని దారూరు (దోరవేటి) స్వంత ఊరు.
ఆయన పిల్లల హృదయాన్ని తనలో ప్రతిష్టింప చేసుకున్నాడు. వారికోసం అనేక సాహిత్య ప్రక్రియలనుతీసుకున్నాడు. రూపకం(భువన విజయం), నాటికలు, లఘు నాటికలు, గేయాలు, గేయ నాటికలు, నృత్య నాటికలు, ఏకపాత్రలు, సంవాదాలు శతకం, నవలిక, కథ ప్రక్రియ బాలసాహిత్యానికి ఊపిరినిస్తాయి. ఆయన పాఠ్యపుస్తక రూపకల్పన కమిటి సభ్యులు పాఠశాల బాలల వార్షిక సంచిక సంపాదక వర్గ సభ్యుడు. రేడియో, టి.వి, పాఠాలు బోధించిన ఉత్తమ ఉపాధ్యాయుడు.

 

వజ్రం అనేక ముఖాలలో ప్రకాశించినట్టు, దోరవేటి వివిధ సాహిత్య ప్రక్రియల్లో బహుకోణాలలో సాకారమవుతాడు. ఆయనను పలుకరిస్తే సాహిత్యసుమాలు వర్షిస్తాయి. జీవితాన్ని ఎంత ప్రేమించాడో సాహిత్యాన్ని అంతే ప్రేమించాడు. నిర్విరామంగా రచనలు చేయడానికి పునాది ఆయన బాల్య జీవితంతోనే జమిలిగా ఎదిగింది. చక్కని శావ్య గొంతుక గలవాడు. ఏ ఇజాలతో కమిట్ కాలేదు. సంప్రదాయం జాతీయత, ఆధునికతలలో నచ్చి న మంచిని వస్తువుగా స్వీకరించి అల్లుకున్నాడు. తనకు తానే సర్వస్వంగా ఎదిగాడు. చిన్ననాటి భజన బృందాలలో పాడవల్సివస్తే తన పాటనే పాడాలన్నంత నిష్టతో కలం పట్టాడు. గట్టి స్వరం గలవాడు నిగర్వి, కష్టజీవి వినయశీలి. ఇప్పటికి 33 పుస్తకాల దాకా ప్రచురించాడు. బాల్యం నుండే అనేక జీవన సంఘర్షణలు ఎదుర్కొన్నాడు. ఆ నేపథ్యంలో ఒనగూరిన మెత్త ని హృదయం దోరవేటి రచనల నిండా పరుచుకొని ఉంది. ఆయన ఆరోతరగతి నుండే రచనలు ప్రారంభించిన నిశిత దృష్టి గలవాడు. పిల్లలకే నా హృదయం అంకితం అన్నంత మమేకమై బడిపిల్లల పక్షపాతి దోరవేటితో డా॥ బెల్లంకొండ సంపత్ కుమార్ నిర్వహించిన ముఖాముఖి :
పిల్లల గురించి రచనలు చేయాలనే ఆలోచన ఎప్పుడు కల్గింది ? ఎందుకు కల్గింది?
నా బాల్య జీవితం కష్టాలతో గడిచింది. పల్లెల్లో బీదకుటుంబాలలోనూ పిల్లలు నాలానే ఉంటారని అనుకుంటాను. నాకు పిల్లలన్నా ఉపాధ్యాయ వృత్తి అన్నా చాలా ఇష్టం. మా గురువు లు కూడా నాకు అంతటి ప్రభావాత్మక ఆదర్శాన్నిచ్చారు. నేను ఉపాధ్యాయ వృత్తిని అమితంగా ప్రేమించి ఉపాధ్యాయుణ్ణయ్యాను. పిల్లల కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో బాలసాహిత్యం రాశాను.
ఎనిమిదో తరగతిలోనే “గజదొంగ గంగన్న” నవల ఆశాను. ఇది కల్పనలు ఊహల ప్రధానంగా నడిచింది. పిల్లలే అందులో హీరోలు. పదోతరగతిలో వక్రరేఖలు, ఇంటర్ ప్రథమ స్థాయిలో గురుకులం పిల్లల నవలలు రాశాను అట్లా పిల్లల కోసం రాయడం ప్రారంభించాను. అయితే ఆనాటి నా పరిస్థితి వల్ల అవి జ్ఞాపకంలోనే మిగిలి పోయాయి ఈనాడు అలభ్యంగా నా జ్ఞాపకంలోనే ఈ ప్రతులు పిల్లల నాటకాలు, బుర్రకథలు, గేయాలు రాశా ను. మా నాన్న యక్షగానాలు ప్రదర్శించేవాడు ఆయన తాళం రాగం లయ నన్ను ఆకట్టుకునేది అలాంటివే రాయాలని తపన పడేవాడిని.
పిల్లల గురించి మీ రచనలేంటివి? సేవలేంటివి ?
బూచాడొచ్చాడు నవలిక జాగృతి వారాపత్రికలో ధారావాహికంగా వచ్చింది. బాలసాహిత్యం రంగారెడ్డి జిల్లా ద్వారా ప్రచురించబడింది. వేసవి సెలవుల్లో సాక్షి ఫన్‌డే లో ప్రచురితమైన నవలిక ఎనిమిదో తరగతిలో ఉపవాచకంగా చేర్చబడింది. ‘హృదయ స్పందన’ గేయాలు సుమారు 150 కథలు పల్లె, చదువు, పశ్చాత్తాపం, ఊరు ప్రయాణం రాశాను. పాఠ్యపుస్తకాలలో సీత ఇష్టాలు బుర్రకథ (7వ తరగతి) చాకలి ఐలమ్మ (5వ తరగతి) బాలనాగమ్మ కథ (6వ తరగతి) లకుముకి పిట్ట ద్వితీయ భాష తెలుగులో ఉన్నాయి. రాష్ర్ట పాఠ్యపుస్తక రూపకల్పనలో సభ్యునిగా భాగ్యస్వామ్య సేవలందించాను. చిగురు, జగద్గిరి శిఖరి ప్రతిభాసరోవరం పాఠశాల బాలల వార్షిక సంచికలకు సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశాను. పిల్లల కోసం సాంస్కృతిక ప్రదర్శనలిచ్చాను. పిల్లలకు నేర్పి వారితో చేయించాను. అవి భువన విజయం రూపకం, నాటికలు ఏకపాత్రాభినయం, సంవాదం మొదలైనవి. అప్పటికప్పుడు తయారుచేసి ప్రదర్శింపజేసినవి ఉన్నాయి. అవన్నీ పిల్లలలో సజీవం గా ఉన్నాయి. పిల్లలకథలు, ఉపాధ్యాయుల కథలు రాశాను, అచ్చయినాయి. పిల్లల కోసం టి.వి, రేడియో పాఠాలు, విరులబాట శతకం రాశాను.
వేసవి సెలవులపై ఏం చెప్పదలచారు?
ఆధునిక కాలంలో పిల్లల మీద ఒత్తిడి పెరిగిపొతున్నది. పెద్దలు చదువుపేరిట పిల్లల హృదయాన్ని అలక్ష్యం చేస్తున్నారు. పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలి. నిర్భంధానికి గురిచేయడం వలన వారిలోని ప్రజ్ఞ నైపుణ్యాలు బయటకు రా లేక పోతున్నాయి. సెలవులలో సైతం పిల్లలను ఆడుకోనివ్వడంలేదు. కుటుంబ సంబంధాలను, బంధుత్వ సంబంధాలను, పొరుగు సంబంధాలను పిల్లలకు పరిచయం చేయాలి. అందుకు భిన్నంగా యాంత్రికతను అలవాటు చేస్తున్నాం పాఠమంటే చదవడం, రాయడం లెక్కలు చేయడం కాదు. తెలువని విషయాలు తెలుసుకోవడం పాఠ్యపుస్తకాలలో ఉన్నది చెప్పడమే కాదు పుస్తకాలలో లేని విద్య కథలు, చర్చ హాస్యధోరణితో పిల్లలలో జ్ఞానం కలిగించవచ్చు. ఆట, పాట పిల్లలను ఆకట్టుకుంటాయి. ‘క్రాంతి’ అనే పిల్లవాన్ని పాత్రగా తల్లిదండ్రులలో మార్పుతేవాలని “వేసవి సెలవుల్లో” రాశా ను. పిల్లల జీవితం చుట్టూ బాధ్యతగల పెద్దల ప్రవర్తన ఎలా ఉండాల్నో ఈ రచన ద్వారా రుజువు చేశాను.
మీరు రాసిన ‘పల్లెకథలు’ ఉపాధ్యాయ కథలు భిన్నమైనవి వాటి నేపథ్యం చెప్పండి. అట్లానే ఉపాధ్యాయ కథలు పిల్లల కథల సంబంధంలోకి వస్తాయా ?
నాకు పిల్లలన్నా పల్లెలన్నా ఇష్టం పల్లెలో పిల్లల ఆత్మీయతకు హద్దు ఉండదు. పిల్లలు పల్లె పర్యావరణానికి దగ్గర. కుటుంబాన్ని అర్థచేసుకుంటూ పెద్దలు చూపే ఆతీ ్మయత కన్నా ఎక్కువ అనుబంధాన్ని కల్గి ఉంటారు. కష్ట సుఖాలలోనూ అంతగా స్పందిస్తారు. పల్లె కుటుంబ జీవన సంబంధాలు గలవారికి ఈ విషయాలు తెలుస్తాయి. ఆ అనుభవాలు లేని వారికి తెలువవు కనుక స్పందించరు. ఇవి ముఖ్యంగా వ్యవసాయం దెబ్బతింటున్న రోజులలో రాశాను. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల పల్లెకథలు ఇవి. బాల్యం ఎలా గాయపడుతుందో వ్యక్తీకరించే ప్రయత్నం చేశాను.
ఉపాధ్యాయుల మనోగతం నిండా పిల్లలే ఉంటారు. పిల్లల ప్రస్తావన లేందే ఉపాధ్యాయుడు లేడు.ఇదే క్రమశిక్షణ, నేను చెప్పిందే వినాలనే ఉపాధ్యాయులకు నేను, నా రచనలు భిన్నమైనవి మంచి టీచర్ పిల్లల దగ్గర గొప్ప అనుభూతిని పొందుతాడు. అట్లానే ప్రభావిత పరుస్తాడు ఉత్తమమైన ఉపాధ్యాయుడు తన స్థానాన్ని తప్పితే చివరకు మిగిలేది శూన్యం కనుక పిల్లల కోసం పడే వెత పిల్లలతో సంబంధమైందే.
మీరు పిల్లల కొరకు, పెద్దవాళ్ళ జీవనేతి వృత్తం గల రచనలు చేశారు. ఏవి ఎక్కువగా రాశారు ?
రెండు సమానంగా సమాంతరంగా రాశాను. పిల్లల ప్రపంచం వేరు. పిల్లల కోసం రాసేవి అక్కడ రాశాను. పెద్దవాళ్ళ జీవనేతివృత్తం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఇవ్వవల్సిన సందేశం అక్కడ ఇవ్వాలి. సమాజం పట్ల బాధ్యతగా భావించేటప్పుడు ఇదేరాయాలని ఉండదు. బహుముఖీనత విభిన్న కోణాల వ్యక్తీకరణే నేను కోరుకుంటాను. తమ ప్రత్యేతలను విలువైన విషయాలను వెల్లడించారు కృతజ్ఞతలు నమస్కారం.

డా॥ బెల్లంకొండ సంపత్ కుమార్
82473 96710

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: