కురుమ బీరన్నల కళావైభవం

  బీరప్ప కథను కళాకారులు తమ తమ కట్టడి గ్రామాల్లో బీరప్ప గుడి దగ్గర ప్రదర్శిస్తారు. ఈ కళాకారులకు కట్టడి గ్రామాలు రాగి శాసనం మీద రాసి ఉంటాయి. వీరి దగ్గర ఉండే రాగి శాసనం మీది లిపిని బట్టి చూస్తే అవి చాలా పురాతనమైనవిగా కనిపిస్తాయి. వీటి మీద బీరప్ప పండుగ చేసినందుకు కురుమలు ఇచ్చే దానాలు, వారి వారి కట్టడి గ్రామాల పేర్లు ఉంటాయి. ఈ శాసనాన్ని ఆధారం చేసుకొని కళాకారులు గ్రామాలకు వెళ్తారు. […]

 

బీరప్ప కథను కళాకారులు తమ తమ కట్టడి గ్రామాల్లో బీరప్ప గుడి దగ్గర ప్రదర్శిస్తారు. ఈ కళాకారులకు కట్టడి గ్రామాలు రాగి శాసనం మీద రాసి ఉంటాయి. వీరి దగ్గర ఉండే రాగి శాసనం మీది లిపిని బట్టి చూస్తే అవి చాలా పురాతనమైనవిగా కనిపిస్తాయి. వీటి మీద బీరప్ప పండుగ చేసినందుకు కురుమలు ఇచ్చే దానాలు, వారి వారి కట్టడి గ్రామాల పేర్లు ఉంటాయి. ఈ శాసనాన్ని ఆధారం చేసుకొని కళాకారులు గ్రామాలకు వెళ్తారు. బీరప్ప పండుగ చేసే సందర్భంలో కళాకారులు పగలు అనుష్ఠానాలు జరిపిస్తూ రాత్రి సమయంలో కథను చెబుతారు. కథ చెప్పేటప్పుడు కళాకారులు ఏడుగురు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు, ఇద్దరు వంతలు ఉంటారు. మిగతావారు డోలు, తాళాలు ,నపేరా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని కథ చెప్తారు. కథలోని స్త్రీ పాత్రలను మగవారే ధరించి ప్రదర్శిస్తారు. వీరు చెప్పే కథలో తెలంగాణ యాస నుడికారం జాతీయాలు పొడుపు కథలు సామెతలు అనేకం ప్రయోగిస్తూ, హాస్యం, భయానకం, యుద్ధం, కరుణ వంటి సన్నివేశాలను రసాత్మకంగా పదర్శిస్తారు.

తెలంగాణలో ఆశ్రిత కళారూపాలు విభిన్నమైన సంస్కృతిని కలిగి, సాంస్కృతిక వైవిధ్యానికి, గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కళాకారులు భిక్షుక గాయకులు, వృత్తి గాయకులు, సంప్రదాయ కళాకారులు, గురువులు, పూజారులుగా పిలువబడుతున్నప్పటికీ, వీరికి ఏ కులమైతే వంశపారంపర్యంగా దాత కులం లేదా పోషక కులం సంక్రమించిందో,ఆ కులం మూల సంస్కృతిని పరిరక్షిస్తూ దానిని భవిష్యత్ తరాలకు అందించే వాహకులుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కళారూపాలు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపో గా మరికొన్ని కొనఊపిరితో మనుగడ సాగిస్తున్నాయి. ఒకప్పుడు కళలు గ్రామా ల ప్రజలకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ గౌరవమైన స్థా నాన్ని నిలుపుకున్నాయి. కానీ నేటి కాలంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. దీనికి అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇవి తమ సాం స్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. అటువంటి కళారూపాల్లో బీరన్నలు ఒకరు. వీరు కురుమలలో ఒకరైనప్పటికీ, కురుమల దేవుడైన బీరప్ప ను కొలుస్తూ,గురువు లు గా పూజారులుగా వ్యవహరిస్తారు. వీరికే బీరన్నలు, బీరప్పలు, బీర్లోళ్లు అనే పేర్లున్నాయి.

బ్రహ్మదేవుడు కుంటి అవతారమెత్తి ఒక కుండను తీసుకొని గంగ ఒడ్డుకు ఒక చెట్టు కింద నిలుస్తాడు. అతన్ని చూసిన నారదుడు ఎవరు నీవు అని ప్రశ్నించగా నేను అనాధనని, ఆ యుషు కూడా అంతంతమాత్రమే అని చెప్తాడు. ఆ మాటలు విన్న నారదుడు, ఇతనే నా చెల్లి కి సరైన భర్త అని అతనికిసూరమ్మ తల్లి కి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత దంపతులిద్దరి తో నారదుడు పెళ్లి తరువాత తిరుపతి కి మొక్కు చెల్లించాలని చెప్పి అందరూ కలిసి బయలుదేరుతారు. దారి మధ్యలో రాత్రి కా గానే ఈ రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఉదయం వెళ్దామని చెప్పి, మధ్యరాత్రి నారదుడు లేచి వారి మధ్యన ఒకతుంటను పెట్టి అక్కడి నుండి తిరిగి పట్నం బయలుదేరుతాడు.

ఉదయం సూరమ్మ తల్లి ఏదో జంతువు తన అన్నను తిన్నదని రోదిస్తూ దేవతలను వేడుకుంటుంది. అప్పటికే బ్రహ్మదేవుడు అక్కడినుండి వెళ్ళిపోతాడు. దేవతలు సూరమ్మ తల్లి పవిత్రురాలని ఆమె పేరుమీద శంకు నాయని పట్నం పొందించి,ఆమెకు దేవతలంతా కలిసి ఈ నారదుని గర్వమనుచాలంటే వీరభద్రుడే సరైన వాడని, బీరప్ప అవతారంగా సూరమ్మతల్లి గర్భ ంలో జన్మించాలని కోరుకొంటారు. ఇదే సమయంలో సూర మ్మ తల్లి కూడా తనకు సంతానం కావాలని కుంపటి గోళం తీసుకొని దేవలోకం మీద పోయడానికి బయలుదేరుతుంది. ఈ విషయం గమనించిన శివుడు మారువేషంలో ఎదురై ఆమె కు సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భం దాల్చిందని తన చెల్లెళ్ల ద్వారా తెలుసుకున్న నారదుడు గర్భంలోనే ఆ శిశువును చంపాలనుకుంటాడు. గర్భంలో ఉన్న బీరప్ప నారదుని దుష్ట బుద్ధిని కనిపెట్టి అతన్ని ఇంట్లోకి రానీయకుండా నే
పంపించివేస్తాడు.

నారదుడి పన్నాగం పండగ పోయేసరికి తిరిగి వెళ్ళి పోతాడు. సూరమ్మ తల్లి తొమ్మిది నెలల తర్వాత బీరన్న కు జన్మనిస్తుంది. ఎలాగైనా బీరప్పను చంపాలని సంకల్పించిన నారదుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి బీరప్ప మేనమామ గండాన పుట్టాడని, మాయమాటలు చెప్పి నారదుని పట్నం పంపించాలని ఆదేశిస్తాడు. అప్పటికే నారదుడు ఏడుగురు కటిక వారిని బీరప్పను దారిలోనే చంపమని పంపిస్తాడు. పల్లకిలో తీసుకెళుతున్న బీరప్ప ఈ విషయం గమనించి జనపాల గుండు వరకు రాగానే ఆ గుండు మీద నిజరూపం దాల్చి తనను చంపడానికి వచ్చిన వారిలో ఐదుగురుని చంపుతాడు. ఇద్దరు మాత్రం తమను చంపవద్దని వేడుకోగా వారిని కూడా వదలక సంహరించి ,రానున్నది కలియుగమని, తనకు కురుమలు నాగుళ్ళు కట్టి పండుగ చేసేదుందని, ఆ గుడి ముందర మీరిద్దరూ తగురాళ్లై నిలువాలని దీవిస్తాడు.

ఇదే సమయంలో అక్క మహంకాళి చెల్లె చంద్రావతి మంద కాచుకుంటూ గంగ ఒడ్డుకు రాగా బీరప్ప మర్రిచెట్టు మీద ఏడుస్తూ కనిపిస్తాడు. మహంకాళి బీరన్నను చూసి నిన్ను నా కన్నబిడ్డలాగా చూసుకుంటానని కొంగు చాపగా అందులో కటారి జగ్గు వేసి దూకుతాడు. అప్పుడు మహంకాళి తన తమ్ముడే బీరప్ప అని సాదుతుంది. అతను పెద్దయ్యాక ఒక రోజున అక్క మహంకాళితో మంద మేపడానికి వస్తానంటాడు. కానీ అక్క నువ్వు రాజ్యమేలాలి గాని మందలు కాయకూడదంటూ వారిస్తుంది. అయినప్పటికీ వినకపోయేసరికి సరే అంటుంది. అతను రోజూ మందను కాస్తుంటే ఒక్కసారిగా ఏడేళ్ల ఎద్దడి వస్తుంది. ఈ మంద మేపడానికి నాగులకొండ పట్నంలో మేత బాగుందని తెలుసుకొని, అక్కడికి మంద మేపడానికి వెళ్తానని అక్క దగ్గర సెలవు తీసుకుంటాడు. అక్కడ నారదుడు తన అల్లుడే బీరప్ప అని గుర్తిస్తాడు. ఒకరోజున బీరప్ప మంద దగ్గర దానం చేస్తుంటే త్రిమూర్తులు బీరన్న పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మారు వేషంలో వచ్చి, పెళ్లి కాని వారు దానం చేస్తే తీసుకున్న వారికి ఇచ్చిన వాడికి మంచిది కాదని తెలిపి, అతనికి పెళ్లి చేసుకోవాలనే కోరికను కలిగిస్తారు. అతను అక్క దగ్గరికి వెళ్లి విషయం చెప్పి తనకు మేన మరదలు ఉంటే చెప్పమంటాడు. అప్పుడు అక్క నీ మేనమామ దుర్మార్గుడని వాడితో గెలవలేమని చెబుతుంది. అయినప్పటికీ అతను వినకపోయేసరికి కొన్ని పందాలను పె ట్టగా, అతను వాటిని కూడా నెగ్గుతాడు. అ

ప్పుడు ఆమె బీరప్పను పసుపు బట్టలతో తిరిగి రావాలని దీవిస్తుంది. అలాగే అక్క రేణుక ఎల్లమ్మ సహాయం తీసుకోమని చెప్పి పంపుతుంది. బీరప్పగంగ ఒడ్డుకు వెళ్లి రేణుక ఎల్లమ్మ ను కలిసి, తన మరదలు తో పెళ్లి చేసుకోవడానికి సహాయం చేయాలని వేడుకుంటాడు. ఆమె తమ్ముని కోరికను కాదనలేక ఎరుకలి వేషం ధరించి నాగులకొండ పట్నం వెళ్లి నారదుని ఏడుగురు కుమార్తెల్లో ఎవరు నీకు సరైన వారో తెలుసుకొని చెప్తానని బయలుదేరుతుంది. నాగులకొండ పట్నం వెళ్ళిన రేణుక ఎల్ల మ్మ నారదునితో నీ కుమార్తెల పెళ్లిళ్లు కావాలంటే మీ తాతలు చేసిన పాపాలు పోవాలని,ఆ పాపాలు పోవాలంటే మీ తాతలు తవ్విన బావిలో స్నానాలు చేయమని అప్పుడు పెళ్లిళ్లు జరుగుతాయని చెబుతుంది. వారంతా స్నానాలకు బయలుదేరగా రేణుక ఎల్లమ్మ బీరప్పతో నీ యొక్క ఏడుగురు మరదళ్లలో చిన్న మరదలు కామరతి నీకు సరైన జోడి అని ఆమెను అడ్డగించి తెచ్చుకోమంటుంది. అక్క చెప్పిన ప్రకారం బీరప్ప కామరతిని గుర్తించి ఆమెను తన అక్క ల నుండి తప్పించాలని ఆమె బంగారు పెట్టను దాచిపెడతాడు.

అప్పుడు కామరావతి ఒంటరిగా చిక్కగా ఆమెకు తను నీ బావని అంటూ విషయం చెప్పగా ఆమె కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అయితే మా తండ్రి దగ్గర తాతల ముత్తాతల నాటినుండి దాచిన బంగారం ఉందని అంతా తీసుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్తుంది. ఆమె ఎంతకీ రాక పోయేసరికి బీరప్ప శివున్ని వేడుకోగా, ఆ శివుడు నువ్వు గారడి వేషం కట్టి తెచ్చుకోమంటాడు. అప్పుడు గారడి వేషం కట్టుకొని పోయి గొంగట్లో కామరతిని తీసుకొని వస్తాడు. బీరప్ప పెళ్లి పీటల మీద ఉండగా గొర్రెల మంద మీద దొంగలు పడ్డారని బోయన్న చెబుతాడు. బీరప్పపెళ్లి పీటల మీద కత్తిని నిలిపి వెళ్తాడు. మంద మీది దొంగల్ని పట్టుకొని తిరిగి వచ్చేసరికి ముహూర్తం గడియ మించిపోతుందని బ్రాహ్మణులు కత్తికి కంకణం కట్టి కామరతికి పెళ్లి చేస్తారు . ఆ తర్వాత బీరప్ప దగ్గరికి తప్పయింది క్షమించుమని నారదుడు వచ్చి శరణు వేడుకోవడంతో కథ ముగుస్తుంది.

ఈ ముగింపు సన్నివేశాన్ని కొందరు కళాకారులు మరొక రకంగా ప్రదర్శిస్తారు .కామ రతిని ఎత్తుకుపోయిన విషయం తెలుసుకున్న నారదుడు బీరప్ప పైకి సైన్యాన్ని పంపుతాడు. బీరప్పకు అక్క మహంకాళి అందుబాటులో లేక పోయేసరికి మంద కాసే బోయన్న సహాయం తీసుకుంటాడు. అతను ఒక్కడే సైన్యాన్ని ఎదురించలేకపోయే సరికి బీరప్ప పెళ్లి పీటల మీద కత్తిని నిలిపి యుద్ధానికి బయలుదేరుతాడు. అయితే బ్రాహ్మణులు ముహూర్తం గడిచిపోతుందని కత్తికి కంకణం కట్టి పెళ్లి చేస్తారు.ఆ తర్వాత బీరప్ప యుద్ధం నుండి తిరిగి వచ్చి బాధపడతాడు. ఎడలగ్గానికైనా అక్క మహంకాళి ఉండాలని బోయన్న చేత కబురు పంపించగా ఆమె నారదుణ్ణి సంహరించి బీరప్ప కు దగ్గరుండి ఘనంగా ఎడ లగ్గం జరిపిస్తుంది. ఈ రకంగా కళాకారులు కొద్దిపాటి తేడాతో చెప్తారు.

బీరప్ప చరిత్ర

వీరభద్రుని అవతారమైన బీరప్ప కురుమల దైవం గా పూ జింపబడుతూ వస్తున్నాడు. ఈ బీరప్ప చరిత్రకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా పంథిని గ్రామానికి చెందిన బీరన్న కళాకారుడైన పొన్న రవి చెప్పిన కథనం ప్రకారం బీరప్ప తండ్రి బ్రహ్మదేవుడు, తల్లి సూరమ్మ దేవి, నారదుని తోడ సూరమ్మ దేవి పుడుతుంది. పుట్టిన కొద్ది గడియల కే ఆమె తల్లిదండ్రులు చనిపోతారు. అన్న నారదుడు తల్లిదండ్రుల గండాన పుట్టావని తీసుకెళ్ళి అడవిలో వదిలి పెడతాడు. పాప అడవిలో ఏడుస్తుంటే శివుడు విని పార్వతి లక్ష్మి సరస్వతికి చెప్పి పాపను పెంచమంటాడు.12 ఏళ్లు పెం చిన తర్వాత ఆమె వారిని నా తల్లిదండ్రులు నా పట్నం గురించి చెప్పమని అడుగుతుంది. అప్పు డు వారు నీ పట్టణం నాగులకొండ అని, నీకు నారదుడు అనే అన్న ఉన్నాడని చెప్తారు. ఈ విష యం తెలుసుకున్న సూరమ్మ తల్లి అన్న దగ్గరకి వెళ్తుంది. అక్కడ సూరమ్మ తల్లిని చూసిన బంటు ఎవరు నీవు అంటూ ప్రశ్నించగా, ఆమె నారదుడు నాకు అన్న కావాలంటూ బదులిస్తుంది. ఆ మాటకు బంటు మా రాజుకు చెల్లెలు ఎవరూ లేరని, మా రాజు పట్నం చూసి, ఆస్తి చూసి అన్న అని పిలుస్తున్నావా అంటూ దూషిస్తాడు. నారదుడు కూడా ఆమె మాటలు విని నాకు చెల్లెలు ఎవ రూ లేరని చెప్పి ఆమెను చెల్లిగా ఒప్పుకోక తిడతాడు. అప్పుడు బంటు బాగా ఆలోచించి నీకు తల్లిదండ్రులు ఎవరు లేరని నేను నీకు గత 12 సంవత్సరాలుగా సేవ చేస్తూ వస్తున్నానని, ఆమె నీకు చెల్లి అని చెప్తుంది కాబట్టి నీకు సేవ చేయడానికి పనికి వస్తుందని ఒప్పిస్తాడు.అప్పటి నుండి ఆమె ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు నారదుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరగా శంకరుడు మారు వేషంలో ప్రత్యక్షమై నీకు చెల్లెలు ఉందని, ఆమెకు పెళ్లి చేయకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిది కాదని చెప్తా డు. అందుకు సరేనంటూ నారదుడు బాగా ఆలోచించి ఒకవేళ నాకు బిడ్డ పుడితే నా చెల్లెలి కొడిక్కే ఇవ్వాల్సి ఉంటుందని పున్నమికి పుచ్ఛుపోయేవాడికి,అమావాస్యకు అయిపోయేవాడికిచ్చి పెళ్లిచేయాలనుకుంటాడు. ఇదే సమయంలో శంకరుడు బ్రహ్మ తో నువ్వు సూరమ్మ తల్లిని పెళ్లి చేసుకోవాలని కోరుతాడు.

బీరన్నలకు కురుమలు పూజారులుగా గురువులుగాఉండే వారసత్వం ఎట్లా సంక్రమించిందో కూడా ,ఒక మౌఖిక కథను కళాకారులు చెప్తారు. బీరన్న చిన్నతనంలో తుంటరి చేష్టలతో ఒక రాజు కోపానికి గురవుతాడు. ఆ కారణం చేత అతను భయపడి నాగ లోకం లోని నాగ గుండం ప్రవేశించి అక్కడ నాగ కన్నెలకు పూజ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నాగగుండం దగ్గరకు గొర్రెలమంద కాచుకుంటూ కురుమలురాగా,బీరన్న పూజ మల్కరాయున్ని పిలిపించి కురుమలకు పూజ చేసే గురువును అవుతానని ,వారికి బొట్టు పెట్టి చెప్పమంటాడు. కురుమలు నమ్మక పోయేసరికి వారిని భయపెట్టైనా సరే గురువును కావాలని అందుకు గొర్రెలకు రోగం తెప్పించి ఆ రోగం నయం కావడానికి కూడా బొట్టు పంపించి వాటికి పెట్టమని పంపిస్తాడు. ఆ గొర్రెల రోగాలు నయం కాగానే కురుమలు బీరన్నకు హారతిచ్చి గురువు గా ఉండమని వేడుకుంటారు. అప్పటినుండి బీరన్న కథ చెప్పుతూ పండుగ చేస్తున్నామంటారు. శుక్రవారం రోజు పండగ ప్రారంభమవుతుంది ఈరోజు బీరప్ప దేవున్ని జలధికి పంపుతారు. ఇందులో భాగంగా కురుమలంతాకలిసి పెద్ద కురుమ ఇంటికి గొర్రె పాలు తీసుకొచ్చి ఒక కుండలో పోస్తారు.

ఆ తర్వాత ఇంటికి ఒక నీళ్ళబిందె, పూజా సామాగ్రి తీసుకొని డోలు వాద్యాలతో గుడికి చేరుకుంటారు. అంతకు ముందు రోజే బీరన్నలు గుడిని శుద్ధి చేసి ఉంచుతారు. మొదట పెద్ద కురుమ ,సార కురుమ ఒక కుడకతోటి కురుమలంతా కలిసి తెచ్చిన పాలను లింగాల మీద పోయగా మిగతా వారు ఇంటికి ఒకరు చొప్పున పాలు పోస్తారు. అంతా కలిసి పండుగ ప్రారంభమవుతుందని ప్ర మాణం చేస్తారు. దీనికంటే ముందు గురువారం రోజున కురుమలంతా పోచమ్మ బోనాలు చేస్తారు. ఈ బోనాల లో ఈర బోనం, గంగ బోనం ప్రత్యేకంగా ఉంటాయి. డోలు వా ద్యాలతో ఊరేగింపుగా పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పిస్తారు. శనివారం రోజున బీరన్నలు లింగాలను జలధికి తీసుకువెళ్లేటప్పుడు ఊరేగింపుగా వెళ్తూ కటార్లు వేస్తారు. ఈ కటార్లు వేయడానికి కారణం కూడా బీరప్పకథలో కనిపిస్తుంది. బీరప్ప కామరతి జాడ కోసం వెళ్ళినప్పుడు దారిలో గంగ తల్లి ఉప్పొంగుతుంది .అప్పుడు బీరప్పకటారు పైకి ఎగురవేసి ముంచేవు గంగా, నీ చెవులు కోస్తా ముక్కు కోస్తా అంటూ కటారు తో పొట్ట మీద కాట్లు వేసుకొని తన రక్తాన్ని దోసిలి పట్టి గంగ మీద భలో భలో అని చల్లితే గంగ శాంతిస్తుంది. ఇట్లా కళాకారులు కథకు అనుగుణంగా నడుచుకుంటూ తమ పుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సందర్భంలో కళాకారులు నడుముకు నాగబంధం, గజ్జల లాగు, గంటలు కట్టుకొని ,బండారి ఒళ్లంతా పూసుకొని కటార్లు పైకెత్తి పొట్ట మీద చేతుల మీద అలుగులు వేసుకుంటూ ఊరేగింపుగా వెళ్తారు.

ఇక ఆదివారం ఇంటికి ఒక బోనం చొప్పున బీరప్ప దేవునికి ల గ్గం బోనం బయలుదేరుతుంది. ఈరోజు గుడి ముందర ప ట్నం వేయడం, గావు పట్టడం జరుగుతుంది. అలాగే మం ద లు బాగుండాలని అర్ధరాత్రి మంద మీద గావు పట్టి బలి చ ల్లుతారు. సోమవారం కథలో భాగంగా ఎరుకలి వేషం ధరి ంచి గుడి దగ్గర కథ చెప్తారు. ఇదే రోజు సందు బోనం, మంగళవారం దేవునికి నాగ బెల్లి బోనం బయలుదేరుతుంది. బుధవారం అక్క మహంకాళి మరియు కామరతి బీరప్ప బోయన్నవేషాలను పెద్ద కురుమ ఇంటి దగ్గర కట్టి గుడి దగ్గర కథ చెప్పి, కామరతికి, మహంకాళికి ఒడి బాల బియ్యం కడతారు.

గురువారం బీరప్ప కథ లో బీరప్ప గారడి వేషం కట్టినట్టుగానే కళాకారులు గజ్జల లాగు తోపుకుల్ల ధరించి గారడి విద్యలు ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా మామిడి పిక్క నాటి చెట్టు పుట్టించి కాత కాపియ్యటం, గొంగట్లో పేలాలు వేయించటం, లెంకలు పెట్టి కట్టేయ్యడం, ఒకరి దగ్గర ఉండే డబ్బులు మరొకరి దగ్గర చూపించడం, చెంపలకు సూదులు దింపుకోవడం ,ఒకరు చూపించిన రాయిని కళ్లకు గంతలు కట్టుకొని,అదే రాయిని చూపించటం వంటి గారడీ విద్యలను ,ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ప్రదర్శిస్తారు. ఈ రకంగా బీరన్నలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని అనుసరిస్తూ కురుమల సంస్కృతి పరిరక్షణలో భాగమవుతూ జీవిస్తున్నారు .వీరిని బీరప్ప దేవుని పేరు మీదనే పిలువడం విశేషంగా చెప్పుకోవచ్చు. బీరన్నలు ప్రత్యేకంగా ఇంటిలో సావార దేవున్ని పూజిస్తారు. ఈ దేవునికి శ్రావణ మాసంలోనూ, దసరా ఉగాదికి పూజ చేస్తారు. వీరి సంస్కృతిని కాపాడుకుంటూనే బీరప్ప మల్లన్న ఎల్లమ్మ కథలను చెప్పుతూ, ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తూ పట్నాలు వేస్తూ బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఈ కళాకారులను ప్రస్తుతించవచ్చు.

బీరప్ప పండుగ విధానం
వీరభద్రుని ప్రతిరూపమైన బీరప్ప దేవునికి కురుమలు వీలునుబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి బీరన్న లను పిలిచి ఏడు రోజులు సామూహికంగా పండుగ జరిపిస్తారు. మొదట బీరన్నల దగ్గరికి కురుమ పెద్దలు వెళ్లి పండుగ కట్టు మాట్లాడుకొని ముహూర్తం నిర్ణయించుకుంటారు. ముహూర్త నిర్ణయం తర్వాత గ్రా మంలోని కురుమలు ఇంటిని శుద్ధి చేసుకుని పండుగకు సిద్ధమవుతారు.

Article about Beerappa Festival History

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: