పట్టాలెక్కిన ‘పవర్’ రైళ్ళు..!

  ఇక నడికుడి –సికింద్రాబాద్ మార్గం కాలుష్యరహితం విద్యుద్ధీకరణ పూర్తిఅవ్వడంతో తీరనున్న వ్యయప్రయాసలు రైళ్ళ రాకపోకల వేళల్లో ఎలాంటి మార్పులేదన్న అధికారులు నల్లగొండ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యుత్ రైళ్ళ రాకపోకలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగురాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన రైలు మార్గంలో ఇంతకాలం డీజిల్ ఇంజన్‌ల రైళ్ళు రాకపోకలు సాగించా యి. సుధీర్ఘకాలం పాటు ఈ మార్గంలో సేవలందించిన డీజి ల్ రైళ్ళకు ఇక నుంచి సెలవు ప్రకటించింది రైల్వే […] The post పట్టాలెక్కిన ‘పవర్’ రైళ్ళు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇక నడికుడి –సికింద్రాబాద్ మార్గం కాలుష్యరహితం
విద్యుద్ధీకరణ పూర్తిఅవ్వడంతో తీరనున్న వ్యయప్రయాసలు
రైళ్ళ రాకపోకల వేళల్లో ఎలాంటి మార్పులేదన్న అధికారులు

నల్లగొండ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యుత్ రైళ్ళ రాకపోకలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగురాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన రైలు మార్గంలో ఇంతకాలం డీజిల్ ఇంజన్‌ల రైళ్ళు రాకపోకలు సాగించా యి. సుధీర్ఘకాలం పాటు ఈ మార్గంలో సేవలందించిన డీజి ల్ రైళ్ళకు ఇక నుంచి సెలవు ప్రకటించింది రైల్వే శాఖ. తె లంగాణలోని బీబీనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడి జంక్షన్ వరకు విద్యుద్దీకరణ పనులు పూర్తికావడంతో బీబీనగర్, నాగిరెడ్డిపల్లి, రామన్నపేట, చిట్యాల, నల్లగొండ, మి ర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి రైలు మార్గంలో విద్యుత్ ఇంజన్ రైళ్ళు పరుగులు పెట్టనున్నాయి. ఈ మార్గంలో ప్ర తినిత్యం 25 సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్,ప్యాసింజర్ రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణలోని పగిడిపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని నల్లపా డు మద్య విద్యుద్దీకరణ పనులు పూర్తికావడం, అందుకు రైల్వే భద్రతా విభాగం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే సికింద్రాబాద్ నుంచి వయా నడికుడి మీదు గా వెళ్ళే మార్గంలో రైళ్ళను విద్యుత్ ఇంజన్‌లతో నడిపించాలని నిర్ణయించి రాకపోకలను ప్రారంభించింది. దీంతో ఇం తకాలం డీజిల్ ఇంజన్‌తో పెద్ద ఎత్తున వెలువడుతున్న కా లుష్యం వెలువడుతుండడంతో ఇకపై ఈ మార్గంలో ఆ సమస్య తీరినట్లే. అదే సందర్బంలో నిర్వహణ వ్యయం కూడా భారంగా పరిణమించిన నేపధ్యంలో విద్యుత్ ఇంజన్‌ల మూలంగా ఊరట కల్గనుంది.

మొత్తానికి పగిడిపల్లి-నల్లపాడు మద్య విద్యుద్దీకరణ పూర్తవ్వడంతో ఆ వ్యయప్రయాసలు తీరిపోనుండంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రైల్వే ప్రయాణికులకు విద్యుత్ ఇంజన్ రైళ్ళతో సౌకర్యవంతంగా ఉండనుంది. ఇదిలా ఉండగా రైళ్ళ రాకపోకలకు సంబందించి గతంలో మాదిరిగా డీజిల్ ఇంజన్‌ల వేళల్లోనే నడుస్తాయని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. కాగా విద్యుత్ ఇంజన్‌లతో నడిచే రైళ్ళ వివరాలు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో కేవలం 8రైళ్ళకు మాత్రమే విద్యుత్ ఇంజన్‌లు అమరుస్తారని, మిగిలిన వాటికి త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

Arrival of Electric Trains has finally begun

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పట్టాలెక్కిన ‘పవర్’ రైళ్ళు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: