చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్

  వరంగల్ : తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఇద్దరు దొంగలతో పాటు, చైన్‌స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న మరో నిందితుడిని మంగళవారం సిసిఎస్, హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి మొత్తం రూ.8 లక్షల 75వేల విలువగల 231 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినవారిలో తూర్పాటి ప్రసాద్ అలియాస్ జగన్, విఎం భంజర ఖమ్మం జిల్లా ప్రస్తుతం నివాసం […] The post చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఇద్దరు దొంగలతో పాటు, చైన్‌స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న మరో నిందితుడిని మంగళవారం సిసిఎస్, హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి మొత్తం రూ.8 లక్షల 75వేల విలువగల 231 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినవారిలో తూర్పాటి ప్రసాద్ అలియాస్ జగన్, విఎం భంజర ఖమ్మం జిల్లా ప్రస్తుతం నివాసం కంబాలపల్లి, కల్తి రాజు రాజలింగాల తిమ్మారావుపేట, ఎస్కూర్ మండలం ఖమ్మం జిల్లా, ప్రస్తుతం నివాసం రేవతి సెంటర్, ఖమ్మం జిల్లాకు చెందినవారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హసన్‌పర్తి, సిసిఎస్ పోలీసులు దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలోని సిసి కెమెరాల దృష్యాల ఆధారంగా ఆటోమీద ఉన్న ఆధారాలు బట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి నిందితుల దగ్గరి నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈకేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎసిపి జితేందర్, సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ రమేష్‌కుమార్, హసన్‌పర్తి ఇన్స్‌పెక్టర్ తిరుమల్, సిసిఎస్ ఎస్సై సంజీవరెడ్డి, ఎఎస్సై శివకుమార్, రాజు, హెడ్‌కానిస్టేబుల్ అహ్మద్‌పాషా, రవి, కానిస్టేబుల్ చంద్రశేఖర్, రాజశేఖర్, మున్నా, వేణుగోపాల్, సల్మాన్‌లను సిపి రవీందర్ అభినందించారు.

Arrest of two Robbers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.