గజ దొంగల అరెస్టు

  బోయిన్‌పల్లి : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 దొంగతానాల కేసులు… 20 కేసుల్లో జైలు జీవితం… మూడు సార్లు ప్రయోగం అయినప్పటికీ చోరీలు మానకుండా మరోసారి అదేబాటలో నడిచి కటకటాలపాలయిన ఘరానా దొంగ మంత్రి శంకర్… తాజాగా పలు చోరీ కేసుల్లో పాల్గొన్న ఇతడితో పాటు మరో నిందితుడు దినకర్‌ను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ మధుకర్‌స్వామి కధనం ప్రకారం ఘరానా దొంగ మంత్రి శంకర్ , మరో […] The post గజ దొంగల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బోయిన్‌పల్లి : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 దొంగతానాల కేసులు… 20 కేసుల్లో జైలు జీవితం… మూడు సార్లు ప్రయోగం అయినప్పటికీ చోరీలు మానకుండా మరోసారి అదేబాటలో నడిచి కటకటాలపాలయిన ఘరానా దొంగ మంత్రి శంకర్… తాజాగా పలు చోరీ కేసుల్లో పాల్గొన్న ఇతడితో పాటు మరో నిందితుడు దినకర్‌ను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ మధుకర్‌స్వామి కధనం ప్రకారం ఘరానా దొంగ మంత్రి శంకర్ , మరో నిందితుడు దినకర్ (ఇతనిపై గాంధీనగర్ పీఎస్ పరశిలో రౌడీషీట్ ఉంది) ఇటీవల కార్ఖానా ,తుకారాంగేట్, నేరెడ్‌మెట్, కుషాయిగుడా,పోలీసే స్టేషన్ పరిధిలో ఇటీవల తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు.

ఇందులో కార్ఖానా, నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు విఫలయత్నం చేశారు. ఆగస్టు 29వ తేదీన నగరంలోని సిరిపురి కాలనీలో దొంగతనానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న వీరిని విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం జెబిఎస్ వద్ద కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, యాక్టీవా ద్విచక్రవానం, ఆటోతో పాటు చోరీలకు ఉపయోగించే ఇనుపరాడ్డు, టార్చిలైట్, స్క్రూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. కార్ఖానా పోలీసులు రెండు టీములుగా ఏర్పడి చాకచక్యంగా గజదొంగలు శంకర్, దివాకర్‌ను అరెస్టు చేసిన సందర్భంగా సిపి అంజన్‌కుమార్ అభినందించినట్లు వెల్లడించారు. శంకర్‌పై తిరిగి పిడియాక్ట్ క్రింద కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Arrest of the robbers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గజ దొంగల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: