నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు : రజత్ కుమార్

హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.  ఈ నెల 11న ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం  ఎన్నికల ఏర్పాట్లపై  ఉదయం 6 నుంచి 8గంటల వరకు మాక్‌ పోలింగ్‌  ఉంటుందని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై రైతు అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేశామని, వారు సంతృప్తి వ్యక్తంచేశారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌కు ఒక […] The post నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు : రజత్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.  ఈ నెల 11న ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం  ఎన్నికల ఏర్పాట్లపై  ఉదయం 6 నుంచి 8గంటల వరకు మాక్‌ పోలింగ్‌  ఉంటుందని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై రైతు అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేశామని, వారు సంతృప్తి వ్యక్తంచేశారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌కు ఒక హెలికాప్టర్‌ను కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక హెలీప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రజత్‌కుమార్‌ తెలిపారు. 400 మంది ఇంజినీర్లు నిరంతరం విధుల్లో ఉంటారని ఆయన వెల్లడించారు. నిజామాబాద్‌లో ఈ నెల 9న రైతుల ర్యాలీకి అనుమతి ఇచ్చామన్నారు.. రాష్ట్రంలో ఫొటో ఓటర్‌ స్లిప్పులు,  గుర్తింపు కార్డుల పంపిణీ 95శాతం పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు.. అదనంగా కేంద్ర బలగాలు కోరామని, అవసరాన్ని బట్టి కేటాయించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధులకు ఎవరు  ఆటంకం కల్గించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.. ఎన్నికల విధులకు మాజీ సైనికులను ఇసి అనుమతించలేదని, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకుంటామని రజత్ కుమార్ చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Arrangements to Nizabad Loksabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు : రజత్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: