ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆదిలాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆదిలాబాద్ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి  ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుండగా, ఆసిఫాబాద్, […] The post ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆదిలాబాద్ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి  ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుండగా, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని 630 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో 7,58,071 మంది మహిళ ఓటర్లు, 7,31687 మంది పురుష ఓటర్లు, 56 మంది ఇతర ఓటర్లతో కలుపుకొని 14, 89,814 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం 2079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 253 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 74 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడు మోడల్ పోలింగ్ కేంద్రాలను, ఏడు మహిళ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 97 శాతం మంది ఓటర్లకు ఓటర్ చీటీలను పంపిణీ చేసినట్లు తెలిపారు. పోల్ చీటీలతో బిఎల్‌వోలు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 2488 కంట్రోల్ యూనిట్లను, 2908 బ్యాలెట్ యూనిట్లను, 2693 వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నట్లు వివరించారు. 414 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 8439 మంది పోలింగ్ సిబ్బందిని నియమించగా, 1373 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచినట్లు పేర్కొన్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వృద్దులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొని వచ్చి ఇంటికి పంపించేందుకు ఆటోలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐకేపీ సిబ్బంది వారికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తారని వెల్లడించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు 12 రకాల గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ కార్డు, పాస్ బుక్, పాన్‌కార్డ్, ఆధార్‌కార్డుతో పాటు ఫోటో ఉండి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు తెచ్చుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో 144 సెక్షన్‌ను అమలు చేయడం జరుగుతుందని, ఎలాంటి ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా చూస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి 11న సాయంత్రం వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద ఇప్పటి వరకు 43 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ… సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలలో అదనపు బలగాలను మోహరించడం జరుగుతుందన్నారు. ఈ పోలింగ్ కేంద్రాలలో సీసీ టివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. మహారాష్ట్ర నుంచి పోలీసులతో పాటు హర్యానా నుంచి హోంగార్డులు రావడం జరిగిందని తెలిపారు. జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలను బందోబస్తు కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు. అలాగే అత్యవసర పరిస్థితులలో వినియోగించుకొనేందుకు యాక్షన్ టీమ్‌లను సైతం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Arrangements for Loksabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: