పార్లమెంట్ పోరుకు సర్వం సిద్ధం

16,50,893 మంది ఓటర్లు 2,181 పోలింగ్ కేంద్రాలు 10,032 పోలింగ్ సిబ్బంది నేడే లోక్‌సభ పోలింగ్ పోలింగ్ సమయం ఉ. 7.00 నుండి సా. 5.00 జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ ప్రతినిధి :  గురువారం జరుగనున్న కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల సిబ్బందిని సామాగ్రితో సహా పోలింగ్ కేంద్రాలకు పంపించామని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని […] The post పార్లమెంట్ పోరుకు సర్వం సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

16,50,893 మంది ఓటర్లు
2,181 పోలింగ్ కేంద్రాలు
10,032 పోలింగ్ సిబ్బంది
నేడే లోక్‌సభ పోలింగ్
పోలింగ్ సమయం ఉ. 7.00 నుండి సా. 5.00
జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ ప్రతినిధి :  గురువారం జరుగనున్న కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల సిబ్బందిని సామాగ్రితో సహా పోలింగ్ కేంద్రాలకు పంపించామని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ ప్రభుత్వ జూనియర్ కలేజీలో, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో, మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి బి.ఆర్.అంబేద్కర్ ప్రభుత్వ మాడల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసిప్షిన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,50,893 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 8,15,230 మంది పురుషులు, 8,35,629 మంది స్త్రీలు, 34 మంది ఇతర ఓటర్లు ఉన్నారని చెప్పారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో 273 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామని అన్నారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా మొత్తం 10,032 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని ఆయన వెల్లడించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు 3,009 బ్యాలెట్ యూనిట్లు, 2,690 కంట్రోల్ యూనిట్లు, 2,914 వివి ప్యాడ్‌లను వినియోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 6 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 230 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించామన్నారు. 226 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో 27,143 మంది దివ్యాంగులు ఉన్నారని ఆయన తెలిపారు. దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు నిర్మించామని, వీల్ ఛైర్లను ఏర్పాటు చేశామని, అంగ వైకల్యం వారికి, వృద్ధులకు సహాయపడేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలలో సహాయకులను నియమించామని ఆయన తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారికి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి ఇంటి వరకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పంపించామని ఆయన తెలిపారు. జిల్లాలో ఓటు హక్కు గల వారందరూ పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అధికారులకు పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.

Arrangements Complete for Parliament Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పార్లమెంట్ పోరుకు సర్వం సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: