పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

  ఆదిలాబాద్: ముథోల్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. బుధవారం పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాల వెళ్లారు. ముథోల్ నియోజకవర్గంలో ముథోల్, తానూరు, కుభీర్, భైంసా, నర్సాపూర్, బాసర, కుంటాల మండలాల్లో పోలింగ్ స్టేషన్లకు ఈవిఎంలను పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేశారు. స్థానిక గురుకుల పాఠశాల మైదానంలో నియోజకవర్గంలో 311 పోలింగ్ కేంద్రాలకు సరిపడ ఎన్నికల సామాగ్రిని ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌కుమార్ , జెసి భాస్కర్‌రావు, ఆర్డీవో రాజుల పర్యవేక్షణలో […] The post పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్: ముథోల్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. బుధవారం పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాల వెళ్లారు. ముథోల్ నియోజకవర్గంలో ముథోల్, తానూరు, కుభీర్, భైంసా, నర్సాపూర్, బాసర, కుంటాల మండలాల్లో పోలింగ్ స్టేషన్లకు ఈవిఎంలను పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేశారు. స్థానిక గురుకుల పాఠశాల మైదానంలో నియోజకవర్గంలో 311 పోలింగ్ కేంద్రాలకు సరిపడ ఎన్నికల సామాగ్రిని ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌కుమార్ , జెసి భాస్కర్‌రావు, ఆర్డీవో రాజుల పర్యవేక్షణలో 31 సాధారణ కౌంటర్లు, 04 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామాగ్రిని పోలీంగ్ సిబ్బందికి అందజేశారు. ముథోల్ నియోజకవర్గంలో మొత్తం 311 పొలింగ్ కేంద్రాలకు గాను 372 ఈవీఏంలు, వివిప్యాడ్లు 372, యూనిట్ బ్యాలెట్లు 372కంట్రోల్ యూనిట్ 372 ను అందజేశారు.

ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహిచేందుకు 31 రూట్‌ అధికారులు 31 సెక్టోరియల్ అధికారులు, 53 మైక్రొ అబ్జర్వర్లు, 311 వెబ్‌కాస్టింగ్‌ సిబ్బంది, 1344 పోలింగ్ సిబ్బంది, 600 పోలీస్ సిబ్బందిని నియమించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్ పి శశిధర్‌రాజులు పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ఎస్ పి తెలియజేశారు. ప్రతి ఒక్కరు స్వేచ్చయుత వాతవరణంలో ఎన్నికలను జరిగే విధంగా సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డివొ రాజు, తహసీల్దార్ నందకిశోర్, డిప్యూటి తహసీల్దార్ శ్రీకాంత్,  సీఐ శ్రీనివాస్‌తో పాటు తదితరులున్నారు.

Arrangements Complete for Mudhol Polls

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: