ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు

ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు గురువారం  జరగనున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని గురువారం ఓటర్లు తేల్చనున్నారు. గత నెలలో జిల్లాలో ఎన్నికల కోలాహలం ప్రారంభం కాగా, పోలింగ్‌తో ఈ ప్రక్రియకు తెర పడనుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలలో పోలింగ్ కేంద్రాల వారీగా నియమించిన సిబ్బందికి ఈవీఎం, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా బుధవారం సాయంత్రం వరకు […] The post ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు గురువారం  జరగనున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని గురువారం ఓటర్లు తేల్చనున్నారు. గత నెలలో జిల్లాలో ఎన్నికల కోలాహలం ప్రారంభం కాగా, పోలింగ్‌తో ఈ ప్రక్రియకు తెర పడనుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలలో పోలింగ్ కేంద్రాల వారీగా నియమించిన సిబ్బందికి ఈవీఎం, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా బుధవారం సాయంత్రం వరకు తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండగా, పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ఓటర్ చైతన్య కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఐకేపీ సిబ్బందిని సహాయకులుగా నియమించి దివ్యాంగులు  పోలింగ్‌లో పాల్గొనేలా చూడనున్నారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అధికారులను నియమించి కిట్‌లను సైతం పంపిణీ చేశారు. ఇక జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. సున్నిత, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరింప చేసి పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఇక మారుమూల ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత గ్రామాల పరిసరాలలో కూంబింగ్‌లను నిర్వహించడంతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించనున్నారు. జిల్లాలోని సిరికొండ, నార్నూర్, గాదిగూడ మండలాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరిన్ని ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించేందుకు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 11 మంది అభ్యర్థులు పోటి చేస్తుండగా ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇక ఎన్నికలలో ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో సభలు, రోడ్‌షోలను ఏర్పాటు చేశారు. పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించి గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ ఓటర్ల నాడిని పసిగట్టడం మాత్రం సాధ్యపడక పోవడంతో కొంత సందిగ్దతకు లోనవుతున్నారు. బహిరంగ ప్రచారం ముగిసినప్పటికీ తమ అనుచరులతో గడపగడప ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. గురువారం జరిగే పోలింగ్‌లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7,58,071 మంది మహిళ ఓటర్లు, 7,31687 మంది పురుష ఓటర్లు, 56 మంది ఇతర ఓటర్లతో కలుపుకొని 14,89,814 మంది ఓటర్లున్నారు. వీరు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 2079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 414 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయగా, పోలింగ్ కోసం 8439 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 1373 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు.

Arrangements Complete for Loksabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: