పాక్‌ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్‌ అల్వీ ప్రమాణ స్వీకారం..

Arif Alvi sworn in as Pakistan new president

ఇస్లామాబాద్ : శనివారం నాటికి అధ్యక్షుడిగా మమ్నూన్‌ హుస్సేన్‌ పదవీ కాలం ముగియడంతో ఆయన అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి వేళ్లి పోవడంతో ఆరిఫ్ అల్వీ పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అల్వీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఎలాంటి అరబట్టాలు లేకుండా అధ్యక్షుడి నివాసంలో ప్రధాన న్యాయమూర్తి సాక్విబ్‌ నిషార్‌ ఆరిఫ్ అల్వీతో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయించారు. అల్వీ ప్రమాణస్వీకారోత్సవానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖుమర్‌ జావేద్‌ బజ్వాతో పాటు ఇతర ముఖ్య సైన్యాధికారులు హాజరయ్యారు.