ఆర్కిటిక్ నక్క బహుదూర ప్రయాణం

ఆర్కిటిక్ యువ జిత్తులమారి నక్క నార్వే నుంచి కెనడా వరకు 3500 కిమీ దూరం కేవలం 76 రోజుల్లో ప్రయాణించడం పరిశోధకులకు ఆశ్చర్యం కలిగించింది. దీనివల్ల కొన్ని జంతువులు సముద్ర మంచుగడ్డలపై చాలా దూరం ప్రయాణించ గలవన్న కొత్త అంశం వెలుగు లోకి వచ్చింది. ఈ నక్కను కోస్టల్ లేదా బ్లూ ఫాక్స్‌గా పిలుస్తుంటారు. నార్వే లోని స్వాల్బార్డ్ అనే ద్వీప సమూహం నుంచి గత ఏడాది బయలుదేరి కెనడా లోని ఉత్తర నునవట్ ద్వీపాల్లో ఒక […] The post ఆర్కిటిక్ నక్క బహుదూర ప్రయాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆర్కిటిక్ యువ జిత్తులమారి నక్క నార్వే నుంచి కెనడా వరకు 3500 కిమీ దూరం కేవలం 76 రోజుల్లో ప్రయాణించడం పరిశోధకులకు ఆశ్చర్యం కలిగించింది. దీనివల్ల కొన్ని జంతువులు సముద్ర మంచుగడ్డలపై చాలా దూరం ప్రయాణించ గలవన్న కొత్త అంశం వెలుగు లోకి వచ్చింది. ఈ నక్కను కోస్టల్ లేదా బ్లూ ఫాక్స్‌గా పిలుస్తుంటారు. నార్వే లోని స్వాల్బార్డ్ అనే ద్వీప సమూహం నుంచి గత ఏడాది బయలుదేరి కెనడా లోని ఉత్తర నునవట్ ద్వీపాల్లో ఒక దానికి చేరుకోడంతో దాని ప్రయాణం ముగిసింది. ఈ ప్రాంతాలన్నీ సీజనల్‌గా సముద్రం మంచు గడ్డలతో కలసి ఉంటాయి. ప్రయాణంలో ఎక్కువ భాగం గడ్డ కట్టిన ఆర్కిటిక్ సముద్రం పైనే సాగింది. ఇది గ్రీన్‌ల్యాండ్ మీదుగా వెళ్లినా తరువాత పశ్చిమం వైపు సాగినట్టు పరిశోధకుల డేటా చూపిస్తోంది. ఎక్కడైతే ఆహారం కరువై పరిస్థితులు దుర్భరంగా మారాయో అక్కడ నుంచి చాలా వేగంగా మంచు ఫలకాల మీదుగా ప్రయాణించింది. ద్రువ ప్రాంత నిస్సార వాతావరణాన్ని తట్టుకుని ఇటువంటి ఆర్కిటిక్ రకం నక్క చాలాకాలం జీవించగలదని ఇదివరకే తెలిసినా అతివేగంగా ఖండాంతర ప్రయాణం సాగించ గలదన్న విషయం మాత్రం ఇం తవరకు తెలియ రాలేదు. ఇది నిజంగా జరుగుతుందని ఆలోచించలేదు.

ఒక వేళ నక్క చనిపోవడం సంభవిస్తే దాని కళేబరాన్ని పడవపై తీసుకురాడానికి కూడా ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మంచుగడ్డల ద్వారా ఏ బోటు ప్రయా ణించలేదని పరిశోధకులు వ్యాఖ్యానించారు. ఈ నక్క స్వాల్బార్డ్ ద్వీపం నుంచి 2018 మార్చి 26న బయలు దేరగా నునావట్ లోని ఎల్లెస్మయిర్ ద్వీపానికి రెండున్నర నెలల తరువాత చేరుకుంది. శాటిలైట్ ట్రాకింగ్ సాధనాన్ని ఉపయోగించి పరిశోధకులు ఒకే ఒక్క రోజులో ఈ ఆడ నక్క దాదాపు 154 కిమీ దూరం ప్రయాణించిందని గుర్తించారు. ఈ తెగల జంతువులకు సంబంధించి ఇదే అత్యంత వేగవంతమైన ప్రయాణంగా రికార్డు కెక్కిందని పరిశోధకులు వివరించారు. నక్క మెడలో అమర్చిన ట్రాకింగ్ కాలర్ 2019 ఫిబ్రవరిలో సంకేతాలు పంపడం మానేసింది. అందువల్ల ఈ నక్క ఎటు వెళ్తుందో తెలియరాలేదు. ఈ అసాధారణ ఖండాంతర ప్రయాణాన్ని ఆర్కిటిక్ నక్క ఎందుకు సాగించిందో మొదట తెలుసుకోవలసి ఉంది. కావలసిన ఆహారం కరువవడం కానీ కొత్త నివాసాన్ని కాంక్షించడం కానీ అయి ఉండాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వనరులను నక్కలు తమ సామర్థంతో వెతుక్కోడానికి సముద్ర మంచు గడ్డలు కీలక పాత్ర వహిస్తాయని అధ్యయనంలో తేలింది.

Arctic fox amazes scientists with 3,500 km trek in 76 days

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్కిటిక్ నక్క బహుదూర ప్రయాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.