కార్పొరేట్ రంగంలో ఫేస్ రీడింగ్…!

  ఫేస్ రీడింగ్, ముఖ సాముద్రిక శాస్త్రం (phigiognomy) ఒకప్పుడు ఇది దైవత్వ కళగా చూసేవాళ్లు. ముఖం చూసి భవిష్యత్తు చెప్పే ఈ కళ కార్పొరేట్ రంగంలో ఇప్పుడు మళ్లీ కీలకపాత్ర పోషిస్తోంది. సాధారణ జీవితంలో మనుషులు ఎదుటివాళ్లను చూసీ చూడగానే ఒ క అంచనాకు వచ్చేస్తారు. ‘ ఈ మనిషిలో ఏదో ఉంది. విషయం ఉండొచ్చు’ ‘ వీడేంట్రా బాబు మరీ జిత్తులమారిలా ఉన్నాడు’ ‘ పిల్ల మొహంలో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది’ ‘ అబ్బే లాభం […] The post కార్పొరేట్ రంగంలో ఫేస్ రీడింగ్…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫేస్ రీడింగ్, ముఖ సాముద్రిక శాస్త్రం (phigiognomy) ఒకప్పుడు ఇది దైవత్వ కళగా చూసేవాళ్లు. ముఖం చూసి భవిష్యత్తు చెప్పే ఈ కళ కార్పొరేట్ రంగంలో ఇప్పుడు మళ్లీ కీలకపాత్ర పోషిస్తోంది. సాధారణ జీవితంలో మనుషులు ఎదుటివాళ్లను చూసీ చూడగానే ఒ క అంచనాకు వచ్చేస్తారు.
‘ ఈ మనిషిలో ఏదో ఉంది. విషయం ఉండొచ్చు’
‘ వీడేంట్రా బాబు మరీ జిత్తులమారిలా ఉన్నాడు’
‘ పిల్ల మొహంలో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది’
‘ అబ్బే లాభం లేదు… వీడెందుకూ పనికిరాడు’
ఇలా ముఖం చూసి అంచనావేసి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ముఖం చూసి మనిషిని చదివేయటం సాధ్యమేనా?
‘face in the index of mind అనే మాట ఇప్పటికీ సరిపోతుందా? అంటే పూర్వం నుంచి కచ్చితమైన అంచనాలు వేసే వాళ్లున్నారు. ఇది ఇప్పుడో శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేశారు. పురాతన గ్రీస్‌కు చెందిన అరిస్టాటిల్ ముఖ సాముద్రిక శాస్త్ర, ముఖ లక్షణ శాస్త్రం, ముఖాకృతితో గుణ నిరూపణ శాస్త్రంలో తను కనుగొ న్న విషయాలకు ఆరు అధ్యయనాలుగా విభజించారు. ఇందులో ము ఖంలో కనిపించే భౌతిక ఆకృతి, శరీర ఆకృతికి సంబంధించిన అంశాలను బట్టి ఫేస్ రీడింగ్ విభజించి దాన్ని బట్టి మనుషుల లక్షణాలు వారి భవిష్యత్తు వివరంగా ఎలా తెలుసుకోవచ్చో రాశాడు. హూమర్, హిప్పోక్రాట్స్ వంటి సంప్రదాయక పండితులు ఫేస్ రీడింగ్ గురించి ప్రముఖ రచనలు చేశారు.

21వ శతాబ్దం నాటికి ఫేస్ రీడింగ్ శాస్త్రీయంగా రూపాంతం చెందింది. కార్పొరేట్ సంస్కృతిలో ఫేస్ రీడింగ్‌కు ప్రాధాన్యత హెచ్చు అయింది. అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల నియామకంలో ఫేస్ రీడింగ్ ఒక మనో విశ్లేషణ ఉపయోగపడే స్థాయికి చేరింది. ఒక వ్యక్తి తన సామర్థాన్ని పదరంగంలో ఉపయోగించడానికి వీలు కలుగుతుందో తెలుసుకునేందుకు ఇది ఒక శాస్త్రీయ నిరూపణ. చేతి రాతను బట్టి వ్యక్తిత్వ లక్షణాలను నిర్థారించేందుకు ఇంటర్వూలలో గ్రాఫాలజీ ఉపయోగిస్తున్నారు. నియామకాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఈ ముఖ సాముద్రిక శాస్త్రాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

ఈ శాస్త్రంలో ముఖ కవళికలు గమనిస్తారు. కను ముక్కు తీరు, కంటిరెప్పలు, బుగ్గలు, పెదవుల ఆకృతి, నవ్వినప్పుడు ఎలా ఉంటారో, అలాగే శరీరంపై ఉండే పుట్టుమచ్చలు, శరీరంపైన ఇతర మచ్చలు ఏ స్థానంలో ఉన్నాయనేది కూడా మనిషి తీరు తెన్నులని చెబుతుందట. ఫేస్ రీడింగ్ ప్రపంచాన్ని శాసించే అవకాశాలు ఎన్నో ఉన్నవనీ, అందుకే చదువుతో పాటు వ్యక్తుల నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. మాట్లాడే పద్ధతి, నడిచే పద్ధతి, కూర్చునే విధానం, దుస్తులు ధరించే విధానం, చివరకు వాటిని ఎంచుకునే విధానం, ఇవన్నీ మనిషి స్వభావాన్ని నిర్వచించేవే. కాబట్టి చాలా శ్రద్ధగా ఎవరికి వాళ్లు తమని తీర్చిదిద్దుకోవాలని, సాధ్యమైనంత వరకు ఎలాంటి లోపాలు లేకుండా పర్‌ఫెక్ట్‌గా ఉండేలా జాగత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Appointments with Face Reading in Corporate Firms

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కార్పొరేట్ రంగంలో ఫేస్ రీడింగ్…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.