ఈ నెల 28 వరకు ఆదర్శ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు

నేటి ఆధునిక సమాజంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన బోధనే ద్యేయంగా ఆదర్శ పాఠశాలల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యా బోధన అందుతోంది. నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి.. వారిలోని ప్రతిభకు సానపెట్టి సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దే దిశగా విద్యాబోధన అందుతోంది. అన్ని వసతులు.. అనుభవజ్ణులైన బోధకులతో బోధన అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి జరుగుతోంది. వచ్చే 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఆరో […]


నేటి ఆధునిక సమాజంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన బోధనే ద్యేయంగా ఆదర్శ పాఠశాలల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యా బోధన అందుతోంది. నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి.. వారిలోని ప్రతిభకు సానపెట్టి సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దే దిశగా విద్యాబోధన అందుతోంది. అన్ని వసతులు.. అనుభవజ్ణులైన బోధకులతో బోధన అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి జరుగుతోంది. వచ్చే 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి గత నెల 28 వ తేదిన నోటిఫీకేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పాఠశాలలో ప్రవేశం కోరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇదే క్రమములో ఏడు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఖాళీల భరీ కూడా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం…

పెద్దశంకరంపేట:ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో 2013 వ సంవత్సరంలో ఆదర్శ పాఠశాల వ్యవస్థ ఆరంభమైంది. మెదక్ జిల్లాలో 7 చోట్ల, ఈ ఆదర్శ పాఠశాలలు పనిచే స్తున్నాయి. మెదక్ జిల్లాలో పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్, చిన్న శంకరంపేట, నర్సాపూర్, రామాయంపేట,చేగుంటలలో ఇవి పని చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరో తరగతిలో మొత్తం 700 సీట్లు ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీంతో పాటే ఏడు నుంచి పదో తరగతి వరకు ఏర్పడిన ఖాళీలను సైతం ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు క్రమం తప్పకుండా త్రిపుల్ ఐటిలో సీట్లు సంపాదిస్తున్నారు. అలాగే నేషనల్ మెరిట్ స్కాలర్ షిపు కోసం నిర్వహించే పరీక్షలో సైతం మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు పాఠ్యేతర అంశాలపై కూడా ఉపాధ్యాయులు ప్రైవేట్‌కు దీటుగా బోధిస్తున్నారు. ఆరో తరగతిలో ఈ పాఠశాలలో చేరాలంటే ప్రత్యేకంగా నిర్వహించే ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం గత నెల 28 వ తేది నుంచి ప్రవేశాల ప్రక్రియను ఆరంభించారు. ఈ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 28 వ తేదితో ముగియనుంది.
ఉన్నత విద్యకు మార్గం
విద్యా సౌకర్యాల పరంగా వెనుకబడిన గ్రామీణప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ఆరు సంవత్సరాల కిందట ప్రభుత్వం ఆదర్శ పాఠశాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ పాఠశాలలో ఒక సారి ఆరవతరగతిలో చేరితే ఇంటర్ వరకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరుపుతారు. పూర్తిగా ఉచితంగా నిర్వహించే బోధనలో నిష్ణాతులైన అధ్యాపకులు నియమింపబడ్డారు. 14 సంవత్సరాలు నిండిన విద్యార్థునులకు వసతి గృహాంలో ఉండి చదువుకునేందుకు ఆవకాశం కూడా కల్పించారు. పెద్దశంకరంపేట మండల పరిదిలోని తిరుమలాపూర్‌లో ఆదర్శ పాఠశాల కోసం ప్రత్యేకంగా ఒక భవనం నిర్మించారు. అయితే వసతి గృహం మాత్రం జాతీయ రహాదారి విస్తరణలో కోల్పోవలసి రావడంతో ఇంకా ఆ విషయం పై స్పష్టత రాలేదు. రెండు అంతస్తులుగా స్లాబ్ నిర్మాణం జరిగినప్పటికీని రోడ్డు విస్తరణ లో అది కూడా పోతుండడంతో మరో చోట నూతన వసతి గృహాం నిర్మించేందుకు అదికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
అర్హులు ఎవరంటే..
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పోందిన పాఠశాలలో నిరవధికంగా 4,5 తరగతులు చదివి ఉండాలి. 2018-19 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదవుతూ పై తరగతికి అర్హత పోంది ఉండాలి. ఓసి, బిసిలు 01.09.2007 నుంచి 31.08.2009 మద్య జన్మించి ఉండాలి. అదే ఎస్సి, ఎస్టిలకు చెందిన విద్యార్థులైతే 01.09.2005 నుంచి 31.08.2009 మద్య జన్మించి ఉండాలి.
ఆదర్శ పాఠశాల లక్ష్యాలు:
వెనుకబాటుకు గురైన బాలికలకు వసతి సౌకర్యం కల్పిస్తారు. బాలురకు రోజు వారి తరగతులు నిర్వహాణలో కార్పోరేట్ సాయి విద్యను అందిస్తారు.
కేంద్రీయ విద్యాలయం స్థాయిలో ఒక్కో తరగతికి రెండు విభాగాల చొప్పున ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన.
విద్యతో పాటు క్రీడలు, కంప్యూటర శిక్షణ, కళలు, సంప్రదాయ వృత్తులో శిక్షణ కల్పించడం.
విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను, పెంపోందించి సమస్యలపై అవగాహనతోవారిలో శక్తి సామర్థాలు పెంపోందించడం.
గ్రంథాలయాల ఏర్పాటు, ప్రయోగశాలలతో కృత్యాధార బోధనకు ప్రాధాన్యం.
ఆరోగ్య పరిరక్షణపై కనీస పరిజ్ణానాన్ని అందించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కావల్సిన సలహాలు, సూచనలు అందజేయడం.
ఆన్‌లైన్ లో దరఖాస్తులు:
ఈ పాఠశాలలో ప్రవేశం కావాలంటే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డు, బోనఫైడ్, కులం, ఆదాయ ధ్రువపత్రాలు ఆవసరమవుతాయి. ఓసి విద్యార్థులకు రూ. 100, బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 దరఖాస్తు రుసుము కింద చెల్లించాలి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. HTTP://TELANGANA.CGG.GOV.IN వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 28 వ తేది లోగా ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖస్తు ప్రతిని సంబంధిత ఆదర్శ పాఠశాలల్లో మార్చి 1 వ తేది లోపు అందజేయాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13 వ తేదిన నిర్వహిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతుల వారికి మధ్యాహ్నాం 2 నుంచి 4 గంటల వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
నాణమైన విద్యను అందిస్తున్నాం: సభావత్ విఠల్ నాయక్ (ఎస్‌వి),ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, పెద్దశంకరంపేట
ఆదర్శ పాఠశాలలో మెరుగైన నాణ్యమైన విద్య లభిస్తోంది. అందుకే ఈ పాఠశాలలో సీటు రావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. పూర్తి స్థాయి శిక్షణ పొందిన అధ్యాపకులు, విద్యార్థులతో మమేకమై బోధించే సిబ్బంది కేవలం ఆదర్శ పాఠశాలలకే స్వంతంగా చెప్పు కోవచ్చు. పాఠ్యాంశాలతో పాటు సాంస్కృతిక, పాఠ్యేతర అంశాలపై కూడా విద్యార్థులకు బోధిస్తున్నాం. మా పాఠశాల నుంచే గత సంవత్సరం ఓకే సారి 28 మందికి నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్పులకు ఎంపిక కావడం వెనుక మా ఉపాధ్యాయుల అవిరళ కృషి దాగిఉంది. ఈ సంవత్సరమే నూతన భవనంలోకి అడుగిడిన మేము ఇక పక్కా ప్రణాళికతో విద్యాభివృద్ది విషయంలో ముందుకు సాగుతున్నాం.

Apply online in Model schools in medak district

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: