పేపర్ సంచుల యూనిట్ల తయారీకి దరఖాస్తుల ఆహ్వానం

 Paper Bags Units

 

హైదరాబాద్ : జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధిలో భాగంగా పేపర్ సంచుల తయారీ యూనిట్ల నెలకొల్పేందుకు నిరుద్యోగ ఎస్సీ యువతి యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యనిర్వహక సంచాకులు మాన్యనాయక్ పేర్కొన్నారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పదిమంది నిరుద్యోగుల ఒక గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 10లక్షలు ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు వార్షిక ఆదాయం రూ. 2లక్షలకు మించకుండా ఉండాలని, వయస్సు 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హుల, ఆదార్, కులదృవీకరణ, ఆదాయ దృవీకరణ, రేషన్‌కార్డు, స్దానికత, ఒకపాస్‌పోర్టు సైజ్ పోటోలు ఈనెల 23లోగా దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

 

Applications for Manufacture of Paper Bags Units

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పేపర్ సంచుల యూనిట్ల తయారీకి దరఖాస్తుల ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.