గిరిజన క్రీడా పాఠశాలల్లో కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

  హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాల్లో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తుల సమర్పణకు 19 సెప్టెంబర్ వరకు గడువు ఉన్నట్లు డిప్యూటి కమిషనర్ సుభాష్ చంద్ర గౌడ్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆదిలాబాద్, కెబి ఆసిఫాబాద్, భద్రాది,కొత్తగూడెం జిల్లాలో క్రీడా పాఠశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కోచ్ ఉద్యోగాలను గౌవర వేతనం పై పని చేయడానికి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. ఈ […] The post గిరిజన క్రీడా పాఠశాలల్లో కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాల్లో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తుల సమర్పణకు 19 సెప్టెంబర్ వరకు గడువు ఉన్నట్లు డిప్యూటి కమిషనర్ సుభాష్ చంద్ర గౌడ్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆదిలాబాద్, కెబి ఆసిఫాబాద్, భద్రాది,కొత్తగూడెం జిల్లాలో క్రీడా పాఠశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కోచ్ ఉద్యోగాలను గౌవర వేతనం పై పని చేయడానికి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. ఈ ఉద్యోగాలకు ఎన్‌ఎస్, ఎన్‌ఐఎస్ నుంచి ఒక సంవత్సరం డిప్లామా సర్టిఫికేట్‌తో పాటు అభ్యర్థులు కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో నందు డిప్లామా సర్టిఫికేట్ కల్గి ఉండాలని తెలిపారు. అభ్యర్ధులు మాసాబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ అకాడమిసెల్ నందు లేదా sportsofficertwd@gmail.comమెయిల్ ద్వారా పంపాలని ఆయన తెలిపారు.

Applications for coach jobs in Tribal Sports Schools

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గిరిజన క్రీడా పాఠశాలల్లో కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: