2020లో యాపిల్ 5జి ఐఫోన్…

  సాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్నీ 5జి దిశగా అడుగులు వేస్తున్నాయి. 5జి సేవలు ప్రారంభించేందుకు మొబైల్ కంపెనీలు అందుకు తగిన విధంగా ఫోన్లను సిద్ధం చేస్తున్నాయి. యాపిల్ నుంచి తొలి 5జి మొబైల్ 2020లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కో పేర్కొన్నారు. యాపిల్‌కు రెండేళ్లుగా క్వాల్కమ్, ఇంటెల్‌తో లీగల్ సమస్యలు సద్దుమణగడంతో 5జికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కనీసం రెండు మోడళ్లు యాపిల్ నుంచి వస్తాయని, […] The post 2020లో యాపిల్ 5జి ఐఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్నీ 5జి దిశగా అడుగులు వేస్తున్నాయి. 5జి సేవలు ప్రారంభించేందుకు మొబైల్ కంపెనీలు అందుకు తగిన విధంగా ఫోన్లను సిద్ధం చేస్తున్నాయి. యాపిల్ నుంచి తొలి 5జి మొబైల్ 2020లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కో పేర్కొన్నారు. యాపిల్‌కు రెండేళ్లుగా క్వాల్కమ్, ఇంటెల్‌తో లీగల్ సమస్యలు సద్దుమణగడంతో 5జికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

కనీసం రెండు మోడళ్లు యాపిల్ నుంచి వస్తాయని, మొత్తం మూడు ఫోన్లు తీసుకురావాలని యాపిల్ యోచిస్తోందని ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కో పేర్కొన్నారు. విదేశాల్లో ఇప్పటికే 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో తొలి దశలో ప్రముఖ మొబైల్ కంపెనీ తయారీదారులైన సామ్‌సంగ్, హువావేలు లబ్ధి పొందనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ రెండు కంపెనీలు 5జి ఫోన్ల తయారీపై విపరీతంగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి పశ్చిమదేశాల్లో 5జి ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే ఈ రేసులో యాపిల్ కాస్త వెనకబడింది.

Apple’s first 5G mobile to be available in 2020

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 2020లో యాపిల్ 5జి ఐఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: