యాపిల్ ఉత్పత్తి కేంద్రం భారత్‌లోనే..

  న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ దృష్టి భారత్ వైపు మరలుతోంది. యాపిల్ తన ఉత్పత్తి కేంద్రాన్ని చైనా నుంచి భారత్‌లో తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా అమెరికా, చైనా దేశాల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యాపిల్ భారత్ వైపు చూస్తోందని, తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు చైనా నుండి భారతదేశానికి తరలించాలని భావిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన […] The post యాపిల్ ఉత్పత్తి కేంద్రం భారత్‌లోనే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ దృష్టి భారత్ వైపు మరలుతోంది. యాపిల్ తన ఉత్పత్తి కేంద్రాన్ని చైనా నుంచి భారత్‌లో తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా అమెరికా, చైనా దేశాల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యాపిల్ భారత్ వైపు చూస్తోందని, తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు చైనా నుండి భారతదేశానికి తరలించాలని భావిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వ కొత్త ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (పిఎల్‌ఐ) పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలని యాపిల్ భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ సంస్థ స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తుల కోసం ఫాక్స్‌కాన్, రిస్టన్‌లతో ఒప్పందం చేసుకుంది.

సమాచారం ప్రకారం, భారత్‌లో దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి కోసం ఈ కాంట్రాక్టర్లను వినియోగించుకోవాలని, అది కూడా ఎక్కువగా ఎగుమతుల కోసమేనని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు గత కొన్ని నెలలుగా యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య పలు సమావేశాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇదే జరిగితే ఐఫోన్ తయారీదారు భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం స్థానిక సోర్సింగ్ నిబంధనలపై ఇచ్చిన సడలింపులపై యాపిల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్‌కు చాలా తక్కువ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఎగుమతి ప్రయోజనాల కోసం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచనుందని సమాచారం.

దేశీయంగా యాపిల్ ఐఫోన్ 7 ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ ఎస్‌ఇ, ఐఫోన్ 6 ఎస్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని భావించినా, గ్లోబల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో నుండి వీటిని తొలగించడంతో దీనికి బ్రేక్ పడింది. యాపిల్ ప్రస్తుతం భారతదేశంలో రీసెల్లర్స్ ద్వారా మాత్రమే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇటీవల దేశంలో రిటైల్ స్టోర్ల ఏర్పాటు ప్రయత్నాలను వేగవంతం చేస్తోందన్న అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. 2021లో దేశంలో మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల సమావేశంలో యాపిల్ సిఇఒ టిమ్ కుక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Apple seeking to more production from china to india

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యాపిల్ ఉత్పత్తి కేంద్రం భారత్‌లోనే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: