ఎపి భవనాలు తెలంగాణకు

    మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాకలపాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఎన్.నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఎపి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నింటిని తెలంగాణకు అప్పగించాలని రాష్ట్ర క్యాబినేట్ ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఎపికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని […] The post ఎపి భవనాలు తెలంగాణకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాకలపాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఎన్.నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఎపి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నింటిని తెలంగాణకు అప్పగించాలని రాష్ట్ర క్యాబినేట్ ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఎపికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్‌లోని ఎపి ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇవ్వాలని కోరింది. వీటిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్ర క్యాబినేట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ఎపి ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను చెరిసగం కేటాయించారు. అయితే ఎపి ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుండి నడుస్తున్నందున హైదరాబాద్లో తమకు కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి.ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తున్నది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి. ఇప్పుడు అవి వినియోగంలోకి రానున్నాయి.

AP secretariat take over to Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపి భవనాలు తెలంగాణకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: