రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో..?

‘భాగమతి’ సక్సెస్ తర్వాత తెరమీదే కాదు బయట కూడా కనిపించడం లేదు స్టార్ బ్యూటీ అనుష్క. ఈ భామ కొత్త సినిమాల విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. కోన వెంకట్ నిర్మాణంలో ఓ డెబ్యు డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందే మూవీతో పాటు ‘సైలెన్స్’ అనే ఇండో అమెరికన్ ఫిలిం మాత్రమే అనుష్క ఒప్పుకున్నట్టు ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్. తాజాగా మరో రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో అనుష్క భాగం కాబోతోందనే వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. […] The post రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘భాగమతి’ సక్సెస్ తర్వాత తెరమీదే కాదు బయట కూడా కనిపించడం లేదు స్టార్ బ్యూటీ అనుష్క. ఈ భామ కొత్త సినిమాల విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. కోన వెంకట్ నిర్మాణంలో ఓ డెబ్యు డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందే మూవీతో పాటు ‘సైలెన్స్’ అనే ఇండో అమెరికన్ ఫిలిం మాత్రమే అనుష్క ఒప్పుకున్నట్టు ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్. తాజాగా మరో రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో అనుష్క భాగం కాబోతోందనే వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం ‘సైరా నరసింహరెడ్డి’లో ఒక థీమ్ సాంగ్ కోసం అనుష్క ఓకే చెప్పినట్టుగా తెలిసింది.

అయితే టీమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. స్వీటీ గతంలో చిరంజీవితో ‘స్టాలిన్’లో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టెప్పులేసింది. దాని తర్వాత ఈ కాంబో సాధ్యపడలేదు. అదేవిధంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో చాలా కీలకంగా అనిపించే ఓ క్యామియో రోల్ కూడా స్వీటీ చేయబోతున్నట్టు మరో న్యూస్. దర్శకుడు రాజమౌళితో ‘బాహుబలి’ రెండు భాగాలు, విక్రమార్కుడు చిత్రాలు చేసింది అనుష్క. కాబట్టి జక్కన్న అడిగితే ఆమె కాదనే ప్రసక్తే ఉండకపోవచ్చు. ఇది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనక నిజమైతే రెండు సినిమాలకు మరో ఆకర్షణ తోడవుతుంది.

Anushka Shetty play special role in RRR?

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: