‘నిశ్శ‌బ్ధం’లో అనుష్క లుక్ విడుద‌ల‌

Anushkaహైదరాబాద్ : విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ప్రముఖ నటి అనుష్క. ఆమె నటిస్తున్న ‘నిశ్శబ్ధం’ సినిమాలో అనుష్క లుక్ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్, కోన వెంకట్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం అమెరికాలో జరిగింది. ఈ సినిమాను తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీ, మళయాల భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించనుందని, తన పేయింటింగ్ ద్వారా మనస్సులోని మాటలను చెబుతుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ‘సైజ్ జీరో’తో బరువు పెరిగిన అనుష్క ‘నిశ్శబ్ధం’ సినిమాలో స్లిమ్ గా కనిపించనుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Anushka Look Release From Nishabdam Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘నిశ్శ‌బ్ధం’లో అనుష్క లుక్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.