తేజ దర్శకత్వంలో అనుష్క?

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వెంకటరమణ’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అయితే అలిమేలు మంగ పాత్రలో నటించే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని దర్శకుడు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కాజల్, అనుష్క ఇద్దరిలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవాలని… వాళ్లు అయితేనే ఈ పాత్రకు న్యాయం జరుగుతుందని తేజ భావిస్తున్నాడట.

మరి ఈ సినిమా చిత్రీకరణ మొదలయ్యే నాటికి కాజల్, అనుష్క ఖాళీగా ఉండాలి. బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం కాజల్ చేతిలో మోసగాళ్లు, ఆచార్య, ముంబయి సాగా, భారతీయుడు 2 చిత్రాలతో పాటు మరో బాలీవుడ్ సినిమా కూడా ఉంది. దీంతో కాజల్ కష్టమే. మరి ఆ లెక్కన అలిమేలు మంగగా అనుష్క నటించే అవకాశాలే ఎక్కువ.

Anushka act in Tejas’s Alamelumanga Venkataramana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తేజ దర్శకత్వంలో అనుష్క? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.