ఇన్ఫీ సిఇఒ సలీల్ పరేఖ్‌పై మరో ఫిర్యాదు

Salil-Parekh

ముంబై : మరో విజిల్‌బ్లోయర్ ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్‌పై ఫిర్యాదు చేశారు. పరేఖ్ ఇన్ఫోసిస్‌లో చేరి ఏడాది మీద ఎనిమిది నెలలైందని, అయితే ముంబై నుండే పనిచేస్తున్నారని, ఈ విధంగా బెంగళూరులో సిఇఒ బస చేసే పరిస్థితిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదుదారుడు చెప్పాడు. పరేఖ్‌ను బెంగుళూరుకు రావాలని బోర్డు ఒత్తిడి చేయకపోవడానికి కారణం ఏమిటి? అని విజిల్‌బ్లోయర్ ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు పంపిన ఒక లేఖలో ప్రశ్నించాడు. వ్యక్తిగత ప్రయాణాల కోసం సిఇఒ పరేఖ్ రూ.22 లక్షలు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. విజిల్‌బ్లోయర్ తాను ఇన్ఫోసిస్ ఆర్థిక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ‘నేను నా పేరు చెప్పలేను, ఎందుకంటే ఇలా చేస్తే ప్రతీకారం తీర్చుకుంటారనే భయం ఉంది.

ఉద్యోగిగా, వాటాదారుగా సంస్థ విలువలకు నష్టం కలిగించే పరేఖ్‌కు సంబంధించిన వాస్తవాల గురించి చైర్మన్, బోర్డుకి తెలియజేయడం నా కర్తవ్యం. ఇన్ఫోసిస్ నిజమైన భావజాలాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు మీ బాధ్యతను నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’ అని లేఖలో విజిల్‌బ్లోవర్ పేర్కొన్నారు. పరేఖ్‌పై రెండు నెలల్లో రెండవ ఫిర్యాదు వచ్చింది. అంతకుముందు సెప్టెంబర్ 20న కొంతమంది ఉద్యోగులు పరేఖ్, సిఎఫ్‌ఒ నీరంజన్ రాయ్‌లపై ఫిర్యాదు చేశారు. వీరు లాభాలను పెంచడానికి అనైతిక పద్ధతులను ఉపయోగించారని ఆరోపించారు. గత నెలలో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతోందని సంస్థ పేర్కొంది.

అయితే ఆరోపణలకు మద్దతుగా ఆధారాలు లేవని గత వారం కంపెనీ తెలిపింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని వివరించింది. పరేఖ్‌కు స్టాక్‌మార్కెట్‌తో కనెక్షన్ ఉందని విజిల్‌బ్లోయర్ ఆరోపించారు. పరేఖ్ అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఆయన తన పెట్టుబడిని పర్యవేక్షించడానికి ముంబైలో ఉన్నాడని, వాటిని రద్దు చేయాలని విజిల్‌బ్లోయల్ సూచించాడు. ఇన్ఫోసిస్ షేర్ ధర సోమవారం బిఎస్‌ఇలో 0.56 శాతం పతనమై రూ.704.50 వద్ద ముగిసింది.

ఫౌండేషన్‌తో సహా 1807 స్వచ్ఛంద సంస్థల ఎఫ్‌సిఆర్‌ఎ రద్దు

చట్ట ఉల్లంఘన గురించి సమాచారం అందుకున్న తర్వాత 2019 సంవత్సరంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1800 స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నమోదును విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద రద్దు చేశారు. దీంతో ఇప్పుడు ఈ సంస్థలు విదేశీ నిధులను పొందలేవు. ఈ సంస్థలలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్, రాజస్థాన్ విశ్వవిద్యాలయం, అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్, వైఎంసిఎ, గుజరాత్, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ మొదలైనవి ఉన్నాయి.

Another complaint against Infosys CEO Salil Parekh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇన్ఫీ సిఇఒ సలీల్ పరేఖ్‌పై మరో ఫిర్యాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.