నిజమాబాద్‌లో అన్నదానం తిరిగి ప్రారంభించిన కల్వకుంట్ల కవిత

జిల్లాకలెక్టర్‌తో సంప్రదించి సిబ్బందికి పాసులు
సామాజిక దూరం ఖచ్చితంగా అమలు
రోజుకు 14 వందల మందికి పైగా అందుతున్న ఉచిత భోజనం

Annapurna canteen

మనతెలంగాణ/హైదరాబాద్: జనతాకర్ఫూ సందర్భంగా విరామం ఇచ్చిన అన్నదాన కార్యక్రమాన్ని నిజమాబాద్ జిల్లాలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. గత రెండు సంవత్సారాల క్రితం భారత్ జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవిత ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం తిరిగి ప్రారంభించడంతో నిజమాబద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నిత్య అన్నదానం కొనసాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారితో పాటు మద్యాహ్న భోజనం రైతుకూలీలకు, ప్రెవేటు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు సమకూరుతుంది.

జనతా కర్ఫూ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిలిపివేయడంతో అనేకమంది పేదలకు మధ్యాహ్నభోజనం లభించలేదు. ఈ విషయాన్ని నిజమాబాద్ జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకురాగా తక్షణం కలెక్టర్ నారాయణరెడ్డితో మాట్లాడి అన్నదానంకోసం కావల్సిన వాలంటీర్లకు, సిబ్బందికి అవసరమైన పాసులను ఏర్పాటు చేయించారు. దీనితో అన్నదాన కార్యక్రమం కోనసాగుతుంది. గతంలో ఎంపి హోదాలో ఆసుపత్రులను కవిత సందర్శించగా రోగులతోపాటు అక్కడ ఉన్న సహాయకులు తమకు ఎదురవుతున్న భోజన ఇబ్బందులను కవిత దృష్టికి తీసుకువచ్చారు. ఆనాటి నుంచి నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో హోటళ్లు మూసివేశారు.

ఫలితంగా ఆసుపత్రికి వచ్చేవారితోపాటు ప్రైటు హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, రైతుకూలీలు భోజనంకోసం ఇబ్బంది పడుతుండటంతో కవిత అధికారులతో సంప్రదించి తిరిగి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం, ప్రభుత్వ మార్గదర్శకాలను అన్నదాన కేంద్రాల్లో ఖచ్చితంగా అమలు చేస్తూ భోజన సౌకర్యాన్ని కల్పించారు. సోమవారం 14 వందల మంది ఉచిత భోజనం చేసినట్లు నిర్వాహకులుతెలిపారు. లాక్‌డౌన్ లేనప్పుడు సుమారు రెండు నుంచి మూడువేల మంది అన్నదాన కేంద్రాల్లో భోజనం చేసేవారని ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆసుపత్రి రోగులతోపాటు రైతుకూలీలు, పేదలు భోజనం చేస్తున్నారని చెప్పారు. లాక్‌డౌన్ ఉండటంతో బయట ఎక్కడ భోజనం దొరకని పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత ప్రారంభించిన అన్నదాన కేంద్రాలు పేదలకు అక్షయపాత్రలయ్యాయి.

 

Annapurna canteen started in Nizamabad by Kavitha

The post నిజమాబాద్‌లో అన్నదానం తిరిగి ప్రారంభించిన కల్వకుంట్ల కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.