కారు- స్కూటీ ఢీ: ఎఎన్‌ఎం మృతి

ANM

 

నిజామాబాద్ : డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెస్లినగర్ తండా వద్ద మంగళవారం కారు, స్కూటి ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన బియ్యం గంగాజమున (36) అనే మహిళ నల్లవెల్లి పిహెచ్‌సిలో ఎఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తుంది. విధుల్లో భాగంగా రోజుమాదిరిగానే జమున తన ద్విచక్రవాహనం యాక్టివా టియస్16ఈవి6798 నడుపుకుంటూ డిచ్‌పల్లి వైపు వస్తుండగా, ఆర్మూర్ వైపు నుండి ఎంహెచ్40బి1168గల కారు వెనుకనుండి అతివేగంగా స్కూటిని ఢీకొంది. దీంతో జమున తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు. మృతురాలికి ఒక పాప ఉంది. తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ANM died in Road accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కారు- స్కూటీ ఢీ: ఎఎన్‌ఎం మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.