ఎరిక్సన్‌పై రూ.7000 కోట్ల జరిమానా

Ericsson

 

న్యూయార్క్: అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌పై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన స్వీడన్ టెలికాం సంస్థ ఎరిక్సన్ అవినీతి దర్యాప్తును మూసివేయడానికి 100 మిలియన్ డాలర్లు (రూ.7100 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. అమెరికా న్యాయ శాఖ ఈ సమాచారం ఇచ్చింది. ఎరిక్సన్ చైనా, వియత్నాం, ఇతర దేశాలలో ప్రభుత్వ అధికారులకు చాలా సంవత్సరాలుగా లంచం ఇచ్చిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. యుఎస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఎరిక్సన్‌పై దర్యాప్తు జరుగుతోంది. అనిల్ అంబానీపై సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన ఎరిక్సన్ ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుండడం గమనార్హం.

నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎరిక్సన్ అంగీకరించింది. 2000 నుండి 2016 వరకు సంస్థ లంచం, ఖాతాల తారుమారు వంటి చర్యలలో పాల్గొంది. వ్యాపారం కొనసాగించేందుకు కంపెనీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చింది. అనిల్ అంబానీ సంస్థ ఆర్‌కామ్‌పై ఎరిక్సన్ గత ఏడాది దివాలా పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ 550 కోట్ల రూపాయలు చెల్లించపోవడంతో అనిల్ అంబానీపై ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంబానీని ధిక్కరించినట్లు కోర్టు దోషిగా తేల్చింది. శిక్షను నివారించడానికి అంబానీ ఎరిక్సన్‌కు నిధులు చెల్లించారు.

Anil Ambani Ericsson to pay Rs 7000 crores

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎరిక్సన్‌పై రూ.7000 కోట్ల జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.