జెట్ ఎయిర్‌వేస్ బిడ్ నుంచి వైదొలిగిన అనిల్ అగర్వాల్

  న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన మూతపడిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ఆశలు అడియాసలు అవుతున్నాయి. మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ట్రస్ట్ వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్ జెట్ ఎయిర్‌వేస్ బిడ్‌ను ఉపసంహరించుకుంది. గత శనివారం గడువు ముగింపు వరకు మూడు అంతర్జాతీయ సంస్థలు బిడ్‌ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం రెండు సంస్థలు అవంతులో గ్రూప్, ఆర్‌ఎ క్రియెటర్‌లు బరిలో ఉన్నాయి. జెట్‌లో సమస్యలను పరిష్కరించని కారణంగా బిడ్‌కు సుముఖంగా […] The post జెట్ ఎయిర్‌వేస్ బిడ్ నుంచి వైదొలిగిన అనిల్ అగర్వాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన మూతపడిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ఆశలు అడియాసలు అవుతున్నాయి. మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ట్రస్ట్ వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్ జెట్ ఎయిర్‌వేస్ బిడ్‌ను ఉపసంహరించుకుంది. గత శనివారం గడువు ముగింపు వరకు మూడు అంతర్జాతీయ సంస్థలు బిడ్‌ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం రెండు సంస్థలు అవంతులో గ్రూప్, ఆర్‌ఎ క్రియెటర్‌లు బరిలో ఉన్నాయి. జెట్‌లో సమస్యలను పరిష్కరించని కారణంగా బిడ్‌కు సుముఖంగా లేమని 24 శాతం వాటాలను కల్గిన ఎతిహాద్ ప్రకటించిన తర్వాత వోల్కన్ వెనక్కి తగ్గింది.

వేదాంత లిమిటెడ్ చైర్మన్, బిలియనీర్ అనిల్ అగర్వాల్ కుటుంబ ట్రస్టు వోకల్ ఇన్వెస్ట్‌మెంట్స్ జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు ప్రయత్నించడంతో బిడ్‌లో కొంత ఆసక్తి నెలకొంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఈ ఏడాది ఏప్రిల్‌లో విమానయాన సేవలకు జెట్ ఎయిర్‌వేస్ దూరమైన విషయం తెలిసిందే. పనామాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ అవంతులో, రష్యా ఫండ్ ట్రెజరీ ఆర్‌ఏ క్రియేటర్‌లు కూడా జెట్‌ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ నెల 10తోనే జెట్ కొనుగోలుకు సంబంధించి ఆసక్తిని వ్యక్తీకరించేందుకు (ఇఒఐ) ఉన్న గడువు ముగిసిపోయింది. ఎతిహాద్ ఎయిర్‌వేస్, హిందుజా గ్రూప్‌లూ జెట్ కొనుగోలుకు మొదట్లో ఆసక్తి చూపినా, ఆ తర్వాత వెనుకకు తగ్గాయి. తాజాగా జెట్ బిడ్‌కు వేదాంత కూడా గుడ్‌బై చెప్పింది.

Anil Agarwal withdraws from Jet Airways bid

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జెట్ ఎయిర్‌వేస్ బిడ్ నుంచి వైదొలిగిన అనిల్ అగర్వాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: