కోపానికి వెయ్యాలి సంకెళ్లు

Married Couples

 

ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఆలోచించం మొదలుపెడితే సమస్య చిన్నదిగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదల వగానే, అర్థం చేసుకోవడం పక్కన పెట్టి అహానికి పోతే అదే పెద్ద సమస్యగా మారుతుంది. ఇగోలను పక్కన పెడితే ప్రతిదీ చిన్న సమస్యగానే కనిపిస్తుంది. ఇద్దరూ సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అరిచి, చేతులో ఏది ఉంటే దాంతో విసిరి, కిటికిల్నీ, తలుపుల్ని పగులగొట్టి, కోపాన్ని చూపినంత మాత్రాన సమస్య తీరదు. భార్యాభర్తలు కోపాన్ని సరిగ్గా డీల్ చేయకపోతే అది విడాకులకు దారితీస్తుంది.

భయం, బాధ, సంతోషం, కరుణ, ప్రేమ, ఎగ్జైట్ మెంట్ లాగే అహం కూడా ఒక ఎమోషనే. ఇది ఒక్కోసారి ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది. ఒకసారి భావాన్ని బయటికి చెప్తే.. మరోసారి ఆ స్థితి ఎదుటివాళ్లను భయపెడుతుంది. ద్వేషం పెంచుకునేలా చేస్తుంది. చెప్పాలనుకున్న విషయం మరుగున పడేసి అహం డామినేట్ చేస్తుంది. అంటే కోపం అన్ని ఎమోషన్స్‌ని కప్పేస్తుంది! అందులో ప్రేమ, సంతోషం కూడా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటు న్నప్పుడు కోపం రావడంలో తప్పు లేదు. కానీ, ఆ కోపం చర్యగా(యాక్షన్) మారి, ఎదుటివాళ్లకు ఇబ్బంది కలిగించినప్పుడే అసలు సమస్య వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాక మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఒకర్నొకరు భరించలేకపోతుంటారు. ఇదంతా కేవలం ఇగోల వల్లే అంటున్నారు ఎక్స్‌పర్ట్. ‘అంతా నీ వల్లే’ అంటూ నిందలేసుకోవడం మొదలుపెడుతుంటారు. అహం అన్నది పార్ట్‌నర్స్ ఇద్దరిలో ఉండొచ్చు. ఒక్కరిలోనూ ఉండొచ్చు. ఇద్దరిలోనూ ఉంటే.. ఎవరూ తగ్గరు. కాబట్టి ఆ సంసారంలో సంతోషం ఆవిరైపోతుంది. ఇక, పార్ట్‌నర్స్‌లో ఒక్కరిలో చెడు అహం ఉంటే.. కొన్నాళ్ల తర్వాత కూల్ పార్ట్‌నర్స్ కూడా బ్యాలెన్స్ కోల్పోతారు. చెడు అహం ఉంటే మీ బంధంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు.

పెత్తనం ఎందుకు?
బంధం అనేది ఒక గేమ్ లాంటిది. ఒకరి మీద మరొకరు స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకరి మీద మరొకరు పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. ‘మా ది డబ్బు ఉన్న కుటుంబం’.. ‘మేమింత చీప్ కాదు’ లాంటి మాటలతో సోషల్, ఫైనాన్షియల్ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. ఇలాంటి ప్రవర్తన రిలేషన్ షిప్ మీద విరక్తి పుట్టిస్తుంది. అప్పుడు కోపం పుడుతుంది. అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు పార్ట్‌నర్స్‌లో ఎవరికో ఒకరికి టెంపర్ లేస్తుంది. ఒక్కోసారి ఎవరి మీది కోపాన్నో పార్ట్‌నర్స్ మీద చూపిస్తారు. బంతిని గోడకు ఎంత గట్టిగా విసిరికొడితే.. అంతే వేగంగా తిరిగొస్తుంది. కోపం కూడా అంతే.. పదేపదే కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కూల్‌గా ఉం డే పార్ట్‌నర్స్ కూడా కొన్నాళ్లకు బ్రేకప్ వరకు వెళతారు.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి
కోపాన్ని కంట్రోల్ ‘యాంగర్ మేనేజ్ మెంట్ ’ అని అనుకుంటారు చాలామంది. అయితే, ‘నాకు అసలు కోపమే రావొద్దు’ అనేది హెల్దీ గోల్ కాదు. దాన్ని ఎంతగా తొక్కిపెట్టినా అది అంత పైకి వస్తుంది. కోపం అనే ఒక సహజమైన ఎమోషన్ వెనకున్న మెసేజ్‌ని అర్థం చేసుకొని, దాన్ని కంట్రోల్ తప్పకుండా హెల్దీగా బయట పెట్టవచ్చు. అదే ‘యాంగర్ మేనేజ్ మెంట్’. అంటే కోపాన్ని ఫీల్ కావాలి కానీ, బయటకు ప్రదర్శించొద్దు. ఆ కోపాన్ని మాటల రూపంలోకి మార్చి చెప్పగలగాలి. అప్పుడే జీవితంలో వచ్చే రకరకాల కల్లోలాల్ని తప్పించుకోగలుగుతారు. ప్రాక్టిస్‌తోనే యాంగర్ మేనేజ్ మెంట్ సాధ్యం అవుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలినవాళ్లే బంధాన్ని మెరుగ్గా, అందంగా నిర్మించుకుంటారు. వేగంగా గోల్స్‌ని అందుకుంటారు. సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన జీవితం సొంతం చేసుకుంటారు.

ప్రతిదానికీ రియాక్ట్ కావొద్దు
కోపం ఉంటే ఏ విషయంలోనైనా ‘ఓవర్ జన్రలైజింగ్ ’ చేస్తారు. ‘నువ్వు నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్ చేస్తావ్. నా అవసరాలను ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవు. అందరు నన్నే తిడతారు. నాకు అర్హత ఉన్నా క్రెడిట్ దక్కదు’ ఇలాంటి మాటలన్నీ అంటే కోపం గిల్లితే వచ్చేవే! ఇవన్నీ ఓవర్ జన్రలైజింగ్ కేటగిరీ కిందే ఉంటాయి. కోపంలో ఉన్నప్పుడు ‘కచ్చితంగా’ ‘తప్పకుండా’ అనే పదాలతో ఏ మాట మాట్లాడినా కష్టంగా ఫీలవుతారు. లోపల నిద్రపోతున్న కోపం వల్లే మన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకుంటున్నారో.. ఒక్కటే ఆలోచిస్తారు. వాళ్లను వాళ్లే అగౌరవ పరుచుకుంటారు. ఇది యాంగ్జైటీకి దారి తీస్తుంది. జరిగిపోయిన విషయాల్ని భూతద్దంలో చూడటం. అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే.. దానికి బాధ్యత వహించాల్సింది పోయి దానికి అవతలి వాళ్లను బ్లేమ్ చేయడం ఇవన్నీ కోపం వల్లే జరుగుతాయి.

చర్చించుకోండి
బంధం అన్నాక ముద్దు ముచ్చటతో పాటు కోపతాపాలు కూడా ఉంటాయని కొంతమంది దంపతులు కవర్ చేస్తుంటారు. వాళ్ల కోపాన్ని మాటల్లో చెప్పకుండా.. చేతల్లో చూపిం చడం కచ్చితంగా ప్రేమలో భాగం కాదు. ఊరికే కోపం వస్తుంటే.. అది గొడవలకు కారణమవుతుంటే.. ‘మళ్లీ కలుస్తాం’ అనే నమ్మకం నెమ్మదిగా పలుచబడుతుంది. ఎందుకంటే ఆ టైంలో అన్న మాటలు మనసుకు గాయం చేస్తాయి. తర్వాత ఆ విషయం మీద కలిసి కూర్చొని మాట్లాడలేకపోతారు. ఈ పోట్లాట ఆగాలంటే కలిసి చర్చించుకోవాలి. బ్యాడ్‌‌ టెంపర్ ఉంటే ఏ విషయం చర్చించాలన్నా కష్టమే. అప్పుడు మళ్లీ కలవడానికి చాలా కష్టపడతారు.

ఎవరి మీదైనా అసహనం ప్రదర్శించడానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ, ఆ లిమిట్ దాటి అసహనం ప్రదర్శిస్తే.. ఒక రోజు అది పరీక్షకు గురవుతుంది. అప్పుడు వాళ్లు మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధం కావొచ్చు. మీలో ని త్యం పొంగే కోపం వల్ల తెలియకుం డానే మీరు మీ భా గస్వామికి దూరం అవుతుంటారు. ఇలాకాకుండా ఏ స మస్యఅయినా చర్చించుకుంటేనే తీరతాయి. నలుగురిలో పలుచన కాకూడదంటే సమస్యను సామరస్యంగా మాట్లా డుకుంటేనే సాధ్యం అంటున్నారు నిపుణులు.

Anger is cause of conflict between husband and wife

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోపానికి వెయ్యాలి సంకెళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.