అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు…

  రాజంపేట్ : చదువంటే భయం లేకుండా అక్షరాలను అలవాటు చేయించి బడి అంటే భయం లేకుండా మార్గం చూపేదే అంగన్‌వాడీ. అలాంటి అంగన్‌వాడీలు అరకొర వసతుల నడుమ ఇబ్బందులు పడుతూ అంగన్‌వాడీ టీచర్లు సెంటర్లను నెట్టుకొస్తున్నారు. అద్దె భవనాలతో కాలం వెళ్ళదీస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటూ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఉన్నటువంటి అంగన్‌వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అవి సైతం ఎప్పుడు కూలుతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందోననే విధంగా భయంతో కాలం వెళ్ళదీస్తున్నారు. […] The post అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజంపేట్ : చదువంటే భయం లేకుండా అక్షరాలను అలవాటు చేయించి బడి అంటే భయం లేకుండా మార్గం చూపేదే అంగన్‌వాడీ. అలాంటి అంగన్‌వాడీలు అరకొర వసతుల నడుమ ఇబ్బందులు పడుతూ అంగన్‌వాడీ టీచర్లు సెంటర్లను నెట్టుకొస్తున్నారు. అద్దె భవనాలతో కాలం వెళ్ళదీస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటూ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఉన్నటువంటి అంగన్‌వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అవి సైతం ఎప్పుడు కూలుతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందోననే విధంగా భయంతో కాలం వెళ్ళదీస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో వర్షాలు పడ్డప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీబీపేట మండలంలో జనగామ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి ప్రాథమిక పాఠశాల కూలిన విషయం పాఠకులకు విధితమే.

మండలంలో చాలా వరకు అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటి అద్దె ఇతర ఖర్చులు సైతం ప్రభుత్వమే భరిస్తుంది. కానీ సొంత భవనాలు నిర్మిస్తే వీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే విధంగా మండలంలోని పలు గ్రామాలలో అంగన్‌వాడీ భవనాలు అర్థాంతరంగానే మిగిలివున్నాయి. అవి సైతం పిల్లర్ల లెవల్‌లోనే ఆగిపోయాయి. నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగిస్తే వారు అర్థాంతరంగా ఆపివేసి బిల్లులు రాలేవనే నెపంతో పనులు ఆపివేసినట్లు తెలిసింది. ఈ భవన నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఈజిఎస్, పంచాయతీరాజ్ నిధులతో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో తమ భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో, తాము సొంత భవనాల్లోకి ఎప్పుడు వెళ్తామో అంటూ అంగన్‌వాడీ టీచర్లు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రక్క విద్యార్థుల పట్ల అన్ని చర్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతున్నారు. కానీ అది ఆచరణలో మాత్రం సాధ్యపడడలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మండలంలో పలు అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు అవసరమున్నాయి. కొన్ని భవనాలు ప్రాథమిక పాఠశాలలో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సొంత భవనం నిర్మిస్తే మరింత మెరుగైన సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. కావున సంబంధిత జిల్లా శాఖ అధికారులు చొరవ చూపి నూతన భవనాల నిర్మాణానికి చొరప చూపాలని అర్థాంతరంగా ఆగిన భవనాలకు పనులు వేగవంతం చేయాలని సదరు కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తా:
* అంగన్‌వాడి సూపర్‌వైజర్ శివలక్ష్మి, రాజంపేట్
మండలంలో అంగన్‌వాడీలు అద్దెలు భవనాల్లోనే కొనసాగుతున్న విషయం వాస్తమేనని, కొన్ని సొంత భవనాలు ఉన్నాయని, మండలంలో ఐదు గ్రామాల్లో అర్థాంతరంగా భవన నిర్మాణాలు ఆగిపోయాయని, అలాగే రెండు గ్రామాలలో అంగన్‌వాడీలకు నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు, మరికొన్ని భవనాలకు త్వరలోనే గ్రామపంచాయతీల్లో తీర్మాణం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి భవన నిర్మాణాలకు మరియు ఇతర మౌళిక వసతుల కొరకు కృషి చేస్తాం.

ఆగిన పనుల పై అధికారులతో ఆరా తీస్తా:
* మండల ఎంపిపి స్వరూప కృష్ణమూర్తి 
మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల గురించి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని, ఆగిపోయిన భవన నిర్మాణాల పై విచారణ చేయిస్తానని ఎంపిపి స్వరూప కృష్ణమూర్తి తెలిపారు. భవన నిర్మాణాలు నిలిచిపోవడానికి కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన భవన నిర్మాణాల కోసం పంచాయతీ పరంగా తీర్మాణాలను ప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు.

Anganwadi Centers in Rent Buildings

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.