పచ్చిమామిడితో రక్తహీనతకు చెక్

  పచ్చి మామిడికాయ.. పేరు వినగానే ఆ పులుపును తల్చుకుని కళ్లు మూతలు పడుతాయి. మామిడికాయ ముక్కలపై ఉప్పు కారం చల్లుకుని తింటుంటే ఆ రుచే వేరు. మామిడి పోషకాలపరంగా చాలా ప్రత్యేకమైంది. పండుతో పోలిస్తే దీనిలో నిరోధశక్తిని పెంచే సి, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. రక్తహీనత రాకుండా ఉండేందుకు మనం ఐరన్ సమృద్ధిగా ఉంటే ఆహారం తీసుకుంటాం. కానీ విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఇనుముని శరీరం సులభంగా గ్రహిస్తుంది. విటమిన్‌సి […] The post పచ్చిమామిడితో రక్తహీనతకు చెక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పచ్చి మామిడికాయ.. పేరు వినగానే ఆ పులుపును తల్చుకుని కళ్లు మూతలు పడుతాయి. మామిడికాయ ముక్కలపై ఉప్పు కారం చల్లుకుని తింటుంటే ఆ రుచే వేరు. మామిడి పోషకాలపరంగా చాలా ప్రత్యేకమైంది. పండుతో పోలిస్తే దీనిలో నిరోధశక్తిని పెంచే సి, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. రక్తహీనత రాకుండా ఉండేందుకు మనం ఐరన్ సమృద్ధిగా ఉంటే ఆహారం తీసుకుంటాం. కానీ విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఇనుముని శరీరం సులభంగా గ్రహిస్తుంది. విటమిన్‌సి అధికంగా ఉండే పచ్చిమామిడి ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. కొత్త రక్తకణాలు ఉత్పన్నమయి రక్తహీనత రాకుండా ఉంటుంది. మామిడి వ్యాధినిరోధకశక్తిని పెంచి క్షయ, కలరా రాకుండా చూస్తుంది. అందుకే పచ్చిమామిడిని ‘ఇమ్యునో నూట్రియంట్’ అని పిలుస్తారు.

పచ్చిమామిడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియలు చురుగ్గా జరిగి బరువు అదుపులో ఉంటుంది. గుండెలో మంట, బీపీ, మధుమేహం సమస్యలున్న వారికి పచ్చిమామిడి చక్కని ఆహారం. దీనిలోని లోగ్లైసిమిక్ స్థాయిలే ఇందుకు కారణం. కంటి ఆరోగ్యానికి మంచిది. ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. దీనిలోని బీటాకెరొటిన్ ఆస్థమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలూ రాకుండా ఉంటాయి. చర్మంలోని కొలాజిన్ తగ్గిపోకుండా చేసి చర్మం ముడత లు పడకుండా చేస్తుంది. కణాలఉత్పత్తి ప్రక్రియని సవ్యంగా జరిగేటట్టు చూస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న మామిడిని ట్రై చేయండి.

Anemia problems can be amended with Green Mango

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పచ్చిమామిడితో రక్తహీనతకు చెక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: