జీలకర్రతో రక్తహీనతకు చెక్!

  జీలకర్రకు మనం వంటల్లో చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. అలాంటి జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత తగ్గించుకోవడానికి జీరా బాగా సహాయపడుతుంది. ఇలాంటి […]

 

జీలకర్రకు మనం వంటల్లో చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. అలాంటి జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత తగ్గించుకోవడానికి జీరా బాగా సహాయపడుతుంది. ఇలాంటి వారు జీలకర్రను రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

1. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను తొలగించి ప్రీ రాడికల్స్ ను నివారించి, వ్యాధులను తట్టుకునేలా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. ఇందుకు జీలకర్రలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండటమే కారణం.
3. జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారణాలను కలిగి ఉండటం వల్ల జలుబు, ఫ్లూ కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
4. ఫైల్స్ ఉన్నవాళ్ళకు జీలకర్ర చక్కటి పరిష్కారం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్, యాంటీ ఫంగల్, కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి మొలల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతాయి.
5. జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీలకర్ర కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. రోజువారీ ఆహారంలో జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Anemia Problem Solved With Cumin

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: