ఫైనల్లో సెరెనా

టొరంటో : ప్రతిష్టాత్మకమైన రోజర్స్‌కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు కెనడా క్రీడాకారిణి బియాన్సా అండ్రెస్కూ కూడా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. పురుషుల డబుల్స్ రోహన్ బోపన్న జోడీ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ (నాదల్) ఫైనల్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్ సెరెనా 16, 63, 64తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మేరి బౌజ్‌కోవాను ఓడించింది. తొలి సెట్‌లో […] The post ఫైనల్లో సెరెనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టొరంటో : ప్రతిష్టాత్మకమైన రోజర్స్‌కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు కెనడా క్రీడాకారిణి బియాన్సా అండ్రెస్కూ కూడా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. పురుషుల డబుల్స్ రోహన్ బోపన్న జోడీ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ (నాదల్) ఫైనల్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్ సెరెనా 16, 63, 64తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మేరి బౌజ్‌కోవాను ఓడించింది. తొలి సెట్‌లో సెరెనాకు షాక్ తగిలింది. ప్రత్యర్థి క్రీడాకారిణి చూడచక్కని షాట్లతో సెరెనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను కైవసం చేసుకుంది. కానీ, రెడో సెట్‌లో సెరెనా పుంజుకుంది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసింది. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. అంతేగాక అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు కాస్త ఆసక్తిగా మారింది.

ఇద్దరు ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు పోరాడారు. అయితే కీలక సమయంలో మేరి ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సెరెనా మ్యాచ్‌పై పట్టు బిగించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్లో కెనడా క్రీడాకారిణి బియాన్సా విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌తో జరిగిన పోరులో 64, 76తో జయభేరి మోగించింది. ప్రారంభం నుంచే ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ, ఆఖరి వరకు నిలకడను ప్రదర్శించిన బియాన్సా వరుసగా రెండు సెట్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.
బోపన్న జోడీ ఔట్
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. బోపన్నడెనిస్ షొపొవలొవ్ (కెనడా) జంట సెమీస్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన వెస్లీ కుల్‌హాఫ్‌రాబిన్ హాసె (జోడీ) చేతిలో పరాయం చవిచేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నెదర్లాండ్స్ జంట 76, 76తో బోపన్న జోడీను ఓడించింది. రెండు సెట్లు కూడా టైబ్రేకర్ వరకు వెళ్లాయి. కానీ, కీలక సమయంలో బోపన్న జంట ఒత్తిడికి గురి కావడంతో ఓటమి తప్పలేదు.

 Andreescu wins Toronto title after tearful Serena Williams

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫైనల్లో సెరెనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: