చందమామ వెన్నెల …మహేశ్ బాబు అందం…

హైదరాబాద్ : చందమామ వెన్నెల… సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అందరూ చెబుతూనే ఉంటారని ప్రముఖ యాంకర్ సుమ ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో మహర్షి సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ కు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజకుమారుడు సినిమా నుంచి నేటి వరకు మహేశ్ బాబు అందం గురించి అందరూ మాట్లాడుకుంటున్నామని, దేవుడు కొందరికి కొన్ని ఇచ్చి, మరికొన్ని […] The post చందమామ వెన్నెల … మహేశ్ బాబు అందం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : చందమామ వెన్నెల… సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అందరూ చెబుతూనే ఉంటారని ప్రముఖ యాంకర్ సుమ ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో మహర్షి సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ కు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజకుమారుడు సినిమా నుంచి నేటి వరకు మహేశ్ బాబు అందం గురించి అందరూ మాట్లాడుకుంటున్నామని, దేవుడు కొందరికి కొన్ని ఇచ్చి, మరికొన్ని ఇవ్వరని, అయితే మహేశ్ బాబుకు మాత్రం అందంతో పాటు బుర్రను కూడా ఇచ్చాడని, ఆయనలో అహంకారమే లేదని  సుమ చమత్కరించారు. సుమ వ్యాఖ్యలపై మహేశ్ బాబు స్పందించారు. తనను పొగిడిన సుమకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సక్సెస్ మీట్ కు రావాలని కోరగానే సుమ వచ్చారని, ఆమె వస్తే తనకు ఎనలేని శక్తి వచ్చినట్టు ఉంటుందని, కార్యక్రమానికే ఓ కళ వస్తుందని మహేశ్ బాబు స్పష్టం చేశారు.

Anchor Suma Comments On Super Star Mahesh Babu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చందమామ వెన్నెల … మహేశ్ బాబు అందం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: