న్యూఢిల్లీ: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ ఇండిగో చిన్న పట్టణాల్లోని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్స్, యాప్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. హిందీ, బెంగాలీతో పాటు 8 భారతీయ భాషల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు డిజిటల్ సక్సెస్ సదస్సు -2019లో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్) నితిన్ సేఠి తెలిపారు. మరింత మంది ప్రయాణికులకు చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, వచ్చే త్రైమాసికం నాటికి హిందీ వెబ్సైట్ ప్రారంభిస్తామని, ఆ తర్వాత యాప్ కూడా ప్రవేశపెట్టనున్నామని ఆయన వివరించారు. తమ ప్రయాణికుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రయాణించే వారి వాటా 25- నుంచి 30 శాతం దాకా ఉంటుందని ఆయన తెలిపారు.
An IndiGo app in local languages will also be launched
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post ప్రాంతీయ భాషలపై ఇండిగో దృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.