చంపేంత ధైర్యం ఉంది కానీ…చచ్చేంత పిరికివాడు కాదు మా నాన్న: అమృత

    నల్లగొండ: మా నాన్న పశ్చాతాపంతో చనిపోయాడేమోనని తాను అన్నానని అమృత తెలిపింది. మారుతీ రావు అంత్యక్రియలకు అమృత వచ్చినప్పుడు ఆమెను బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తన తండ్రి మృతదేహం చూడకుండానే వెనుదిరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అయితే మారుతీ రావుది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నానని, ఆత్మహత్యకు కారణం మాత్రం తనకు తెలియదన్నారు. ఒక మనిషిని చంపించేంత ధైర్యమున్న మా నాన్నకు, ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని తాను […] The post చంపేంత ధైర్యం ఉంది కానీ… చచ్చేంత పిరికివాడు కాదు మా నాన్న: అమృత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

నల్లగొండ: మా నాన్న పశ్చాతాపంతో చనిపోయాడేమోనని తాను అన్నానని అమృత తెలిపింది. మారుతీ రావు అంత్యక్రియలకు అమృత వచ్చినప్పుడు ఆమెను బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తన తండ్రి మృతదేహం చూడకుండానే వెనుదిరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అయితే మారుతీ రావుది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నానని, ఆత్మహత్యకు కారణం మాత్రం తనకు తెలియదన్నారు. ఒక మనిషిని చంపించేంత ధైర్యమున్న మా నాన్నకు, ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని తాను అనుకుంటున్నానని, మారుతీ రావు, శ్రవణ్‌కు మధ్య గొడవలు ఉన్నాయని వెల్లడించింది. బాబును చూపించమని మా అమ్మ ఓ సారి నా దగ్గరకు వచ్చిందని, బాబాను చూపించనని మా అమ్మతో చెప్పానని, తన భర్తను చంపిన వారికి చట్ట పరంగా శిక్ష పడాలని తాను కోరుకున్నానని, ఎవరో చంపాలని, తనకు తానుగా చావాలని తాను ఏనాడూ కోరుకోలేదన్నారు. నాకిప్పుడు భర్త లేడు, తండ్రి లేడని పేర్కొంది. మారుతీ రావు హైదరాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

 

Amurtha Pranay accept Maruthi rao’s Suicide

The post చంపేంత ధైర్యం ఉంది కానీ… చచ్చేంత పిరికివాడు కాదు మా నాన్న: అమృత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: