తల్లిని కలిసి ఓదార్చిన అమృత

  హైదరాబాద్ : మారుతీరావు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కన్నతల్లి గిరిజను అమృత శనివారం కలిసి ఓదార్చింది. రెండేళ్లుగా ఉన్న ఊరిలో కన్నబిడ్డను కళ్ళారా చూడని ఆ తల్లి కల నెరవేరింది. ఈ మేరకు అమృత తన కుమారుడితో పాటు తల్లి ఇంటికి చేరుకుని దాదాపు అరగంట పాటు ముచ్చటించింది. ఈక్రమంలో తన మనువడిని ఎత్తుకుని ఆపై గుండెలకు హత్తుకుని గిరిజ ముద్దాడింది. ఇదిలావుండగా గిరిజ ఇంటికి పోలీసు బందోబస్తుతో చేరుకున్న అమృత చూసిన తల్లి […] The post తల్లిని కలిసి ఓదార్చిన అమృత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : మారుతీరావు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కన్నతల్లి గిరిజను అమృత శనివారం కలిసి ఓదార్చింది. రెండేళ్లుగా ఉన్న ఊరిలో కన్నబిడ్డను కళ్ళారా చూడని ఆ తల్లి కల నెరవేరింది. ఈ మేరకు అమృత తన కుమారుడితో పాటు తల్లి ఇంటికి చేరుకుని దాదాపు అరగంట పాటు ముచ్చటించింది. ఈక్రమంలో తన మనువడిని ఎత్తుకుని ఆపై గుండెలకు హత్తుకుని గిరిజ ముద్దాడింది. ఇదిలావుండగా గిరిజ ఇంటికి పోలీసు బందోబస్తుతో చేరుకున్న అమృత చూసిన తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.

ఒకవైపు కన్న కూతురు, మరోవైపు మనువడిని గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమైంది. తల్లి, కూతురు, మనువడు దాదాపు అరగంట పాటు ఇంట్లో ఏకాంతంగా గడిపారు. వెళుతూ..వెళుతూ మళ్ళీ వస్తానమ్మా, నీకు నేనున్నానంటూ చేతులు ఊపుతూ అమృత తిరిగి అత్తగారి ఇంటికి వెళ్లింది. తల్లి,కూతురు తిరిగి కలిశారని మిర్యాలగూడ పట్టణంలో దావానంలా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో జనాలు గిరిజ ఇంటికి చేరుకున్నారు. జరిగింది జరిగిపోయింది…ఇక తల్లీకూతుళ్లు కలకాలం కలిసుండాలని అక్కడకి వచ్చిన వారు చర్చించుకోవడం కనిపించింది.

Amruta comforts mother Girija

The post తల్లిని కలిసి ఓదార్చిన అమృత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: