ఒక్కో సైనికుడి చావుకు 10 మంది శత్రువుల సంహారం

సాంగ్లి(మహారాష్ట్ర): ఒక్కో భారతీయ సైనికుడి వీరమరణానికి 10 మంది చొప్పున శత్రువులను సంహరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. గురువారం నాడిక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో భారత భద్రతావ్యవస్థను పటిష్టం చేశామని ఆయన చెప్పారు. పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారతీయ వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై జరిపిన దాడులను ప్రస్తావిస్తూ భారతదేశ సత్తా ఏమిటో ఇప్పుడు యావత్ […] The post ఒక్కో సైనికుడి చావుకు 10 మంది శత్రువుల సంహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సాంగ్లి(మహారాష్ట్ర): ఒక్కో భారతీయ సైనికుడి వీరమరణానికి 10 మంది చొప్పున శత్రువులను సంహరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. గురువారం నాడిక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లో భారత భద్రతావ్యవస్థను పటిష్టం చేశామని ఆయన చెప్పారు. పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారతీయ వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై జరిపిన దాడులను ప్రస్తావిస్తూ భారతదేశ సత్తా ఏమిటో ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసిందని ఆయన చెప్పారు.

జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఎన్‌సిపిలపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అన్న విషయాన్ని రాహుల్ గాంధీ, శరద్ పవార్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Amit Shah hails Modi for abrogation of Article 370, Amit Shah warns that 10 enemies will be killed for every Indian Soldiers death

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒక్కో సైనికుడి చావుకు 10 మంది శత్రువుల సంహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: