డిఫరెంట్ థ్రిల్లర్…

Amalapal

 

అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ‘ఆమె’. భిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమలాపాల్ బోల్డ్ లుక్ సంచలనం సృష్టించింది. ఈనెల 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ‘ఆమె’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “ఈ పోస్టర్ విడుదల చేస్తుంటే నాకు 25 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్లనట్టు అనిపించింది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం ‘ఆమె’. చరితచిత్ర ద్వారా నేను హీరో అయ్యాను. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం ‘ఆమె’తో తమ్మారెడ్డి భరద్వాజ వస్తున్నందుకు ఆనందంగా ఉంది”అని అన్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాలో అమలాపాల్ నటన చూసి షాకయ్యాను. ఈ తరంలో ఇంత గొప్పగా నటించిన వాళ్లు లేరు. ఈ సినిమా విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. నా జీవితంలో మరచిపోలేని చిత్రంగా ‘ఆమె’ మిగులుతుంది”అని తెలిపారు.

దర్శకుడు రత్నకుమార్ మాట్లాడుతూ “నా సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాను సెన్సార్ బోర్డు లేడీ చూసి మెచ్చుకున్నారు. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం”అని చెప్పారు. అమలాపాల్ మాట్లాడుతూ “నాకు స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చేశాను. ఇందులో ధైర్యంగా నటించాను. సినిమాలోని ఓ సీన్ చూసి అనురాగ్ కశ్యప్ అన్న మాటలను అంత తేలికగా మరచిపోలేను. ఇందులో నగ్నత్వం కన్నా నా కళ్లలో ఎక్కువ బాధ కనిపించిందని ఆయన అన్న మాటలను మరచిపోలేను”అని అన్నారు.

Amalapal’s acting shocked Thammareddy Bharadwaja

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డిఫరెంట్ థ్రిల్లర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.