ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది

Amala Paul

 

గత కొంతకాలంగా అమలాపాల్ వ్యవహార శైలి యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివాదాల జోలికి వెళ్లకుండా ఈ బ్యూటీ ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతోంది. ఓవైపు విహార యాత్రలు.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవల ‘ఆమె’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ సినిమా తమిళనాట ఘనవిజయం సాధించడమే కాకుండా… తెలుగులోనూ చక్కని ఆదరణ దక్కించుకుంది. ఈ ఫలితం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందట. ఈ క్రమంలోనే అమలాపాల్ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విహార యాత్రలకు వెళ్తోంది.

తాజాగా ఇండోనేషియాలోని బాలి దీవులకు వెళ్లింది. అక్కడ దీవుల్లో ఇదిగో అమలా ఇలా సేద తీరుతోంది. బాలిలోని ఓ ఓపెన్ టాప్ స్పాలో ఈ బ్యూటీ సేదదీరుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఎర్రని గులాబి పూల రెక్కలతో పాటు అక్కడ అడవి పూలతో అలంకరించిన స్నానాల తొట్టెలో చిద్విలాసంగా కనిపిస్తున్న అమలాపాల్ ఎంతో రిలాక్స్‌డ్‌గా కనిపిస్తోంది. బాలిలోని పచ్చని అడవులు, ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ.

Amala Paul enjoying Beauty of Nature

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.